Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CIBIL Score Rules: సిబిల్‌ స్కోర్‌ నియమాలు ఏంటో తెలుసా?

సిబిల్‌ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ అనేక ఆర్థిక సమస్యలలో ఒకటి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ (CIBIL) అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న సంస్థ. బ్యాంకులతో సహా అనేక ఆర్థిక సంస్థలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. సిబిల్‌ ప్రధాన పని ఏమిటంటే, ఒక వ్యక్తి తన లావాదేవీల ద్వారా అతని ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవడం, ఆ డేటాను వివిధ ఆర్థిక సంస్థలతో పంచుకోవడం. ఇప్పుడు సిబిల్‌లో చాలా మార్పులు వచ్చాయి..

CIBIL Score Rules: సిబిల్‌ స్కోర్‌ నియమాలు ఏంటో తెలుసా?
Cibil Score
Subhash Goud
|

Updated on: Jul 09, 2024 | 10:53 AM

Share

సిబిల్‌ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ అనేక ఆర్థిక సమస్యలలో ఒకటి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ (CIBIL) అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న సంస్థ. బ్యాంకులతో సహా అనేక ఆర్థిక సంస్థలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. సిబిల్‌ ప్రధాన పని ఏమిటంటే, ఒక వ్యక్తి తన లావాదేవీల ద్వారా అతని ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవడం, ఆ డేటాను వివిధ ఆర్థిక సంస్థలతో పంచుకోవడం. ఇప్పుడు సిబిల్‌లో చాలా మార్పులు వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ స్కోర్ విధానాలపై ఆర్థిక సంస్థలు పారదర్శకంగా ఉండకపోవడంపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సిబిల్‌ స్కోర్‌కు సంబంధించి కొన్ని ముఖ్యమైన నియమాలను అమలు చేస్తోంది. ఏమిటి అవి? కొత్త విధానాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: ఆ పథకం డబ్బులు రాగానే లవర్స్‌తో పరారైన 11 మంది భార్యలు.. ఈ భర్తల కష్టం మరెవరికీ రాకూడదు

  1. కస్టమర్ తప్పనిసరిగా తెలియజేయాలి: బ్యాంకు లేదా నాన్-బ్యాంకింగ్ సంస్థ కస్టమర్ క్రెడిట్ రిపోర్ట్‌ను తనిఖీ చేసినప్పుడల్లా ఆ కస్టమర్‌కు సమాచారాన్ని పంపడం అవసరం. సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ లేదా ఇమెయిల్ ద్వారా పంపవచ్చు. క్రెడిట్ స్కోర్‌లపై అనేక ఫిర్యాదుల నేపథ్యంలో ఈ మార్పు జరిగింది.
  2. రుణం తిరస్కరిస్తే! ఒకవేళ కస్టమర్ రుణం దరఖాస్తు తిరస్కరిస్తే దానికి కారణాన్ని అతనికి తెలియజేయాలి. ఇది కస్టమర్ తన అభ్యర్థనను ఎందుకు తిరస్కరించారో అర్థం చేసుకోవడం సులభం చేస్తుంది. దీనికి కారణాల జాబితాను తయారు చేసి అన్ని ఆర్థిక సంస్థలకు పంపడం తప్పనిసరి.
  3. ఇవి కూడా చదవండి
  4. సంవత్సరానికి ఒకసారి ఉచిత క్రెడిట్ నివేదిక: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఆదేశం ప్రకారం, ఆర్థిక సంస్థలు తమ వినియోగదారులకు సంవత్సరానికి ఒకసారి ఉచితంగా క్రెడిట్ స్కోర్‌ను అందించాలి. ఈ విధంగా వినియోగదారులు తమ పూర్తి క్రెడిట్ నివేదికను సులభంగా తనిఖీ చేయవచ్చు. ఇది కస్టమర్ సిబిల్‌ స్కోర్, పూర్తి క్రెడిట్ చరిత్రను సంవత్సరానికి ఒకసారి తెలుసుకోవడానికి సహాయపడుతుంది. క్రెడిట్ స్కోర్ సంబంధిత సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి నోడల్ అధికారి ఉంటారు.
  5. ఫిర్యాదును 30 రోజుల్లోగా పరిష్కరించాలి: క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ 30 రోజుల్లోగా కస్టమర్ ఫిర్యాదును పరిష్కరించకపోతే, రోజుకు రూ. 100 జరిమానాతో చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఫిర్యాదు ఎంత ఎక్కువ ఆలస్యం అయితే జరిమానా ఎక్కువ. రుణం పంపిణీ చేసే సంస్థకు 21 రోజులు, క్రెడిట్ బ్యూరోకు 9 రోజులు వ్యవధి. 21 రోజుల్లోగా బ్యాంక్ క్రెడిట్ బ్యూరోకు తెలియజేయకపోతే, బ్యాంకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ సమాచారం అందిన 9 రోజుల తర్వాత కూడా ఫిర్యాదు పరిష్కారం కాకపోతే క్రెడిట్ బ్యూరో కూడా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: మరో కొత్త వ్యాపారంలోకి అంబానీ.. కొత్త ఓఎస్‌తో చౌకైన జియో స్మార్ట్‌టీవీలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి