AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులు గుడ్‌న్యూస్‌.. అదేంటో తెలిస్తే ఎగిరి గంతులేస్తారు!

EPFO: ఈపీఎఫ్ వెబ్‌సైట్లో సరికొత్త ఫామ్- 13ని తీసుకురావడంతో పాటు పలు కీలక మార్పులను చేసింది. అందులో ముఖ్యమైనది పీఎఫ్ కాలిక్యులేషన్స్‌లో ఏవి ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. ఏవి ట్యాక్స్ పరిధిలో ఉండవు అనే వివరాలు స్పష్టంగా పేర్కొననున్నారు. ఈ కొత్త ఫీచర్ ద్వారా పన్ను..

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులు గుడ్‌న్యూస్‌.. అదేంటో తెలిస్తే ఎగిరి గంతులేస్తారు!
Subhash Goud
|

Updated on: Apr 26, 2025 | 8:13 PM

Share

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) ఇప్పుడు ఉద్యోగాలు మారేటప్పుడు PF (ప్రావిడెంట్ ఫండ్) బదిలీ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇప్పుడు చాలా సందర్భాలలో PF బదిలీ కోసం యజమాని నుండి అనుమతి తీసుకోవలసిన అవసరం ఉండదని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. గతంలో లాగా పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి అకౌంట్‌ బదిలీ చేయాలంటే రెండు కంపెనీల ఆమోదం తప్పనిసరి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటిదేమి ఉండదు. పాత కంపెనీ ఆమోదం తెలుపగానే ఆటోమేటిక్‌గా ప్రస్తుత కంపెనీకి పీఎఫ్‌ ఖాతా బదిలీ అవుతుంది. ఇందులో భాగంగా EPFO ఫారమ్ 13 కోసం కొత్త, మెరుగైన సాఫ్ట్‌వేర్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్‌ ద్వారా అకౌంట్‌ బదిలీ మరింత సులభతరం కానుంది.

ఈ సదుపాయంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన 1.25 కోట్లకు పైగా సభ్యులకు పెద్ద ఉపశమనం కల్పించింది. ఇప్పుడు నిధుల బదిలీ ప్రక్రియ మొత్తం వేగవంతం అవుతుంది. ఇది ప్రతి సంవత్సరం సుమారు రూ.90,000 కోట్ల బదిలీని సులభతరం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

EPFO కూడా UAN బల్క్ జనరేషన్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇప్పుడు సభ్యుల ID, అందుబాటులో ఉన్న ఇతర సమాచారం ఆధారంగా UAN లను త్వరగా జారీ చేయవచ్చు. తద్వారా నిధులను సభ్యుల ఖాతాలకు సకాలంలో జమ చేయవచ్చు.

ఈపీఎఫ్ వెబ్‌సైట్లో సరికొత్త ఫామ్- 13ని తీసుకురావడంతో పాటు పలు కీలక మార్పులను చేసింది. అందులో ముఖ్యమైనది పీఎఫ్ కాలిక్యులేషన్స్‌లో ఏవి ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. ఏవి ట్యాక్స్ పరిధిలో ఉండవు అనే వివరాలు స్పష్టంగా పేర్కొననున్నారు. ఈ కొత్త ఫీచర్ ద్వారా పన్ను పరిధిలోకి వచ్చే పీఎఫ్ వడ్డీపై ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) పై కచ్చితమైన లెక్కలు ఉంటాయి. దీని ద్వారా ఈపీఎఫ్ఓ, సభ్యులకు పన్ను బకాయిలపై ఒక క్లారిటీ ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు