AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amaravati Capital: ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Amaravati Capital: అమరావతి చట్టబద్దత బిల్లును ఏప్రిల్ 1, 2 తేదీల్లో పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. సుమారు 5 గంటల పాటు లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లుపై చర్చలు జరిగాయి. ఎలాంటి సవరణలు లేకుండానే బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అమరావతి..

Amaravati Capital: ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
Andhra Pradesh
Subhash Goud
|

Updated on: Apr 06, 2026 | 10:30 PM

Share

Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో, అభివృద్ధి పథంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది.  అమరావతికి ఏకైక రాజధానిగా శాశ్వత చట్టబద్ధత కల్పించే “ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు-2026” సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు చేరిన తర్వాత ఇప్పుడు కేంద్ర న్యాయశాఖ అమరావతి రాజధాని గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే పార్లమెంట్‌లోని ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం తర్వాత ఈ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. అప్పుడు రాష్ట్రపతి ఆమోదంతో ఏపీ రాజధాని అమరావతి కానుంది.

అయితే  అమరావతి చట్టబద్దత బిల్లును ఏప్రిల్ 1, 2 తేదీల్లో పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. సుమారు 5 గంటల పాటు లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లుపై చర్చలు జరిగాయి. ఎలాంటి సవరణలు లేకుండానే బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో అమరావతి ప్రాంత ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి పాదయాత్రగా వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు అమరావతి రైతులు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ చైర్మన్ రాధాకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఈ చట్టబద్దతో అమరావతి అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో పాటు, అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల సేకరణకు, పెట్టుబడుల రాకకు పూర్తి స్థాయి భరోసా లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ములిచ్చిన తమ త్యాగానికి ప్రభుత్వం చట్టబద్ధమైన గుర్తింపునిచ్చిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి కోసం సుదీర్ఘకాలం సాగిన పోరాటానికి ఇది ఒక విజయంగా వారు భావిస్తున్నారు.

గెజిట్ నోటిఫికేషన్ ప్రధానాంశాలు:

ప్రభుత్వం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌లో పలు కీలక అంశాలను పొందుపరిచింది:

  • ఏకైక రాజధాని: గతంలో చర్చకు వచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనను పక్కన పెట్టి, అమరావతిని పూర్తిస్థాయి పాలనా, శాసన, న్యాయ రాజధానిగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
  • భూ వినియోగం: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) పరిధిలోని భూములను మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసేందుకు గెజిట్ ద్వారా అనుమతులు మంజూరయ్యాయి.
  • నిర్మాణ పనులు: నిలిచిపోయిన ఐకానిక్ భవనాలు (సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ), మౌలిక సదుపాయాల కల్పన పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించేందుకు ఈ నోటిఫికేషన్ మార్గం సుగమం చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు