AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో కూతుళ్లను చిదిమేస్తున్న తండ్రులు!

ఇలాంటి తండ్రి ఒకడు ఈ భూమ్మీద ఒకడున్నాడంటే నమ్మలేమేమో! కరీంనగర్ రూరల్‌లోని ఆ పొలాల్లో ఆ సాయంత్రం ప్రశాంతంగానే ఉంది. కానీ, ఆ గాలిలో ఒక మృత్యువు వాసన దాగుందని ఆ పసిపాపలకు తెలియదు. ఒకే కాన్పులో పుట్టిన ఆ కవలలు.. ఒకరినొకరు చూసుకుంటూ ముసిముసి నవ్వులు చిందిస్తున్నారు. తమని ఎత్తుకున్నది తండ్రి అని, తమని ఆడించడానికి తీసుకెళ్తున్నాడని ఆ పసిప్రాణాలు మురిసిపోయాయి. కానీ.. ఆ రాక్షసుడి చేతిలో ఆటబొమ్మలు లేవు.. కాలకూట విషముంది! 'ఆకలేస్తోందా అమ్మా.. ఇదిగో పాలు తాగండి అంటూ ఆ పసిపెదవులకు గడ్డిమందును అంటించాడు. నోరు కాలకముందే.. ఆ ఊపిరి ఆగిపోకముందే.. గిజగిజలాడుతున్న ఆ ఇద్దరు బిడ్డలను నిర్దాక్షిణ్యంగా బావిలోకి విసిరేశాడు.

నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో కూతుళ్లను చిదిమేస్తున్న తండ్రులు!
82
Anand T
|

Updated on: Apr 06, 2026 | 10:15 PM

Share

గడ్డిమందు తాగితే ఎలా ఉంటుందో తెలుసా. నొప్పి, మంట కాదది.. అదొక నరకయాతన. నోరు, నాలుక, గొంతు పూర్తిగా కాలిపోతుంది. కడుపు లోపలి వరకు ఉండే పైపు కాలిపోయి, చిల్లులు పడుతుంది. విపరీతమైన కడుపునొప్పి. అసలైన నరకం.. స్పృహ కోల్పోకపోవడం. స్పృహలోనే ఉంటారు గానీ.. గాలి అందక నీటి నుంచి బయటపడ్డ చేపలా గిలగిలాకొట్టుకుంటారు. లోపల అవయవాలు ఎలా కాలిపోయి కుళ్లిపోతున్నాయో, ఊపిరి ఎలా అందడం లేదో తెలుస్తుంది. అంతటి బాధను పెద్దోళ్లే తట్టుకోలేరు. మరి.. చిన్నారులకు తాగిస్తే? అంత క్రూరంగా తాగించాడీ తండ్రీ. కొన ఊపిరి ఉందనో, కసి తీరకనో.. గడ్డిమందు తాగించిన అవే చేతులతో బావిలోకి తోసేశాడు! కారణం ఒక్కటే.. ఆ తండ్రి కడుపున ఆడపిల్లలుగా పుట్టడమే. ఈ కవలలు ఊరంతటికీ ఎంత ప్రత్యేకమో.. ‘బంగారం లాంటి పిల్లలు’ అని చూసి ఎంత మురిసిపోతారో ఈ అంగన్‌వాడీ ఆయమ్మను చూస్తే చాలు. ఫ్లెక్సీలో ఈ కవలలను చూసి.. ‘చిన్ను, జున్ను.. రండమ్మా అన్నం పెడతా’.. ‘కోడి గుడ్డు కూడా దాచి ఉంచా తిందురు రండమ్మా’ అని పిలుస్తుంటే.. గుండె తరుక్కుపోయింది అక్కడున్న వాళ్లకి. ఆ ఫ్లెక్సీలో ఈ చిన్నదాన్ని ప్రత్యేకంగా చూపించి… ‘ఈ బుడ్డది ఏం చేస్తుందో తెలుసా.. గుడ్డు సగం తిని, ఎవరికీ తెలియకుండా ఇంకో సగం దాచుకుంటుందట’. చంటితనం కాదది. పెద్దరికం. మిగతా సగం వాళ్ల అమ్మకి ఇవ్వడానికట. పిల్లల ఆకలి అమ్మకు తెలుస్తుందంటారు. ఈ పిల్లలకి అమ్మ...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి