AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్ 15 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో అనుకూలత.. ఆదాయం కూడా పెరుగుతుంది!

Horoscope Today (September 15, 202): మంగళవారం 12 రాశుల వారికి గ్రహాల ప్రభావంతో మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. మేష రాశి వారికి ఉద్యోగంలో సానుకూల మార్పులతో పాటు వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కలిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంతో పాటు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి ఊహించని ఉపశమనం పొందవచ్చు. మిథున రాశి వారికి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.

సెప్టెంబర్ 15 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో అనుకూలత.. ఆదాయం కూడా పెరుగుతుంది!
Horoscope Today 15 September 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 15, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (సెప్టెంబర్ 15, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి అనుకోకుండా విముక్తి లభిస్తుంది. మిథున రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు చాలావరకు సత్ఫలితాలనిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సర్వత్రా విశేషమైన గౌరవమర్యాదలు లభి స్తాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. దైవ కార్యాలు, శుభ కార్యాల మీద ఖర్చు పెడతారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి అనుకోకుండా విముక్తి లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహా రాలు, ఆదాయ వృద్ధి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనం దాన్ని నింపుతుంది. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లలకు చదువుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు చాలావరకు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి రంగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెద్దల సలహాలు తీసుకుని వ్యాపా రాల్లో ముందుకు దూసుకు వెడతారు. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు సొంత ఊర్లో ఉద్యోగం లభిస్తుంది. కుటుంబానికి కొంత సమయం కేటాయించడం చాలా మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

బంధువులు, కుటుంబ సభ్యులతో వివాదాలు అనుకోకుండా పరిష్కారమవుతాయి. ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు అవకాశాలు అందివస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు, పనులు, ప్రయత్నాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్ర మాల మీద దృష్టి పెడతారు. ప్రయాణాలు, ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. శుభకార్యాలకు సంబంధించి దగ్గరి బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు లభి స్తాయి. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు ఒక మెట్టు పైకి ఎక్కే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఉన్నవారు మరింత ఉత్సాహంగా పనిచేసి అంచనాలకు తగ్గట్టుగా లాభాలు అందుకుంటారు. కుటుంబానికి సంబంధించి కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు చేపడతారు. బంధువులు లేదా సన్నిహితులతో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. రాజకీయ వర్గాల వారితో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ఆలోచన చేస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. దూర ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారంలో కొత్త ప్రణాళికలను చేర్చి సక్సెస్ అవుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాల్లో భాగస్వాములతో కొద్దిగా మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అను కూలంగా సాగుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల విద్యా విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటికి బంధుమిత్రుల రాకపోకలుంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలకు అధికారులు విలువనిస్తారు. వృత్తి, వ్యాపారాల్లోసొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దగ్గర బంధువులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కొందరు మిత్రుల విషయంలో ఆందోళనకర విషయాలు వింటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితంలో పని భారం పెరుగుతుంది. వృత్తి రంగంలో ఉన్నవారికి బాగా డిమాండ్ పెరుగు తుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలలో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. మోసపోవడం గానీ, నష్టపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను అతికష్టం మీద సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం, ఖర్చులు దాదాపు సరిసమానంగా ఉంటాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. చిన్ననాటి మిత్రులతో పాటు కొందరు దూరపు బంధువులను కూడా కలుసుకుంటారు. ఆర్థిక విషయాల్లో రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా, సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగు తుంది. వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను మరింత జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. మితిమీరిన ఔదార్య గుణం వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలలో, ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Follow Us