AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్ర సంచారంతో ఆ రాశులకు అదృష్టమే అదృష్టం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

సెప్టెంబర్ 13 నుంచి 23 వరకు చంద్రుడు, గురువు మధ్య ఏర్పడే శుభ సంబంధాలు కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలను అందించనున్నాయి. గజకేసరి యోగం, గురువు పంచమ దృష్టి, పరివర్తన వంటి గ్రహ సంబంధాల ప్రభావంతో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మీన రాశుల వారికి ఆర్థికంగా మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది. లక్ష్మీ కటాక్షంతో పాటు చాలాకాలంగా ఎదురుచూస్తున్న కోరికలు, ఆశలు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఆరు రాశుల వారికి ఈ కాలం ఎందుకు ప్రత్యేకమో తెలుసుకోండి.

చంద్ర సంచారంతో ఆ రాశులకు అదృష్టమే అదృష్టం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
Gajakesari Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 13, 2026 | 9:18 PM

Share

ఈ నెల (సెప్టెంబర్) 13 నుంచి 23 వరకు చంద్రుడికి ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో కనెక్షన్ ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశులవారి జీవితాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి కారణమవుతుంది. ఈ నెల 13న తులా రాశిలో ఉన్న చంద్రుడికి గురువు కేంద్ర స్థితి వల్ల గజకేసరి యోగం, ఆ తర్వాత వృశ్చిక రాశిలో ఉన్న చంద్రుడి మీద గురువు పంచమ దృష్టి, ఆ తర్వాత ధనూ రాశిలో చంద్రుడికి గురువుతో పరివర్తన, చివరగా మకర రాశిలో ఉన్న చంద్రుడికి గురువు సప్తమ కేంద్ర స్థితి వల్ల గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి. వీటి వల్ల మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం కలిగి, కోరికలు, ఆశలు తప్పకుండా నెరవేరుతాయి.

మేషం

ఈ రాశివారికి చంద్రుడు పది రోజుల పాటు అనుకూలంగా మారుతున్నందువల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఉద్యోగంలో హోదా, జీతభత్యాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఈ పది రోజుల్లో చేపట్టే ఎటువంటి ప్రయత్నమైనా తప్పకుండా ఫలిస్తుంది. విదేశీ అవకాశాలు లభిస్తాయి.

వృషభం

ఈ రాశికి తృతీయ, లాభస్థానాల అధిపతుల మధ్య శుభ సంబంధం ఏర్పడడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీరు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగాలు పడతాయి. సామాజికంగా రాజపూజ్యాలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మిథునం

ఈ రాశికి ధనాధిపతి అయిన చంద్రుడికి ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో సంబంధం ఏర్పడడం వల్ల ఈ పది రోజుల్లో ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా నూరు శాతం సఫలమవు తుంది. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, ఆదాయం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారా లకు డిమాండ్ వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో మంచిఉద్యోగం లభిస్తుంది.

కర్కాటకం

రాశ్యధిపతి చంద్రుడికి, ఇదే రాశిలో ఉన్న గురువుకు కనెక్షన్ ఏర్పడడం వల్ల ఈ రాశివారికి రాజ పూజ్యాలు, రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఏ పని తలపెట్టినా సఫలమవుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. తల్లి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. విదేశీ సంపాదన యోగం పడుతుంది.

తుల

ఈ రాశికి దశమ స్థానాధిపతి అయిన చంద్రుడికి ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో సంబంధం ఏర్ప డడం వల్ల రాజయోగాలతో పాటు, ధన యోగాలు కూడా కలుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా ఘన విజయాలు సాధిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది.

మీనం

ఈ రాశికి పంచమ స్థానాధిపతి అయిన చంద్రుడికి గురు సంబంధం వల్ల బలం పెరగడంతో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అపారమైన ధన లాభం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఊహించని లాభాలనిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి.

Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న జ్యోతిష్య విశ్లేషణలు సాధారణ జ్యోతిష్య విశ్వాసాలు, గ్రహాల సంచారాల ఆధారంగా అందించబడినవి మాత్రమే. ఇవి శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలు కావు. పాఠకులు వీటిని వ్యక్తిగత నమ్మకాలు, ఆసక్తి మేరకు మాత్రమే పరిగణించాలి.

Follow Us