Kuja Blessings: కుజుడి కటాక్షం.. ఆ రాశుల వారికి ఆస్తి, భూ లాభాలు ఖాయం..!
Kuja Gochar 2026: సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12 వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచరించనున్నాడు. ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో కుజుడి యుతి కారణంగా నీచభంగ ప్రభావం ఏర్పడి, కుజుడికి బలం పెరుగుతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఈ సంచారం భూమి, ఆస్తులు, అధికారం, ఆదాయం, ధైర్యం వంటి అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి స్థిరాస్తి లాభాలు, ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి.

ఈ నెల(సెప్టెంబర్) 18 నుంచి నవంబర్ 12 వరకు కుజుడు తనకు మిత్ర క్షేత్రం, నీచ స్థానమైన కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నాడు.. అయితే, ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో యుతి చెందడం వల్ల కుజుడికి నీచభంగం జరిగి, ఉచ్ఛ బలం కలిగింది. భూమి, ఆస్తులు, వివాదాలు, అధికారం, ఆదాయం, సాహసం, పోరాటం, ధైర్యం వంటి లక్షణాలకు కారకుడైన కుజుడు కొన్ని రాశులకు అత్యంత శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా స్థిరాస్తులు ఇచ్చే అవకాశం ఉంది. ఉచ్ఛ గురువుతో కలిసిన కుజుడి కర్కాటక రాశి సంచారం వల్ల మేషం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులకు ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది.
మేష రాశి
రాశ్యధిపతి కుజుడు నాలుగవ స్థానంలో, అంటే కేంద్ర స్థానంలో నీచబడడం తో పాటు గురువుతో కలవడం వల్ల ఈ రాశివారికి నీచ భంగ రాజయోగం కలిగింది. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది.. సొంత ఇంటి ప్రయత్నాలు నిరాటంకంగా సాగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.
కర్కాటక రాశి
ఈ రాశిలో కుజుడి సంచారం వల్ల ఈ రాశివారు ఆస్తిపాస్తులను సమకూర్చుకునే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలను రాజీమార్గంలో పరిష్కరించుకుని లబ్ధి పొందుతారు. సొంత ఇంటి కల నెరవేరు తుంది. స్థలాల మీద పెట్టుబడులు పెడతారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు, ఆస్తుల క్రయ విక్రయాలు జరిపేవారు అంచనాలకు మించి లాభాలార్జిస్తారు. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభి స్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు గతం కంటే బాగా లాభిస్తాయి.
తులా రాశి
ఈ రాశికి దశమ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విలువైన ఆస్తి చేతికి వస్తుంది. ఆస్తిపాస్తులను పెంచుకోవడం జరుగు తుంది. స్థలాలు, పొలాల మీద పెట్టుబడులు పెడతారు. ఆస్తుల క్రయ విక్రయాల్లో లబ్ధి పొందు తారు. కొద్దిపాటి పెట్టుబడులతో బాగా లాభాలు పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతులు, జీతభ త్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తాయి.
వృశ్చిక రాశి
రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానంలో ప్రవేశించి ఉచ్ఛ బలం సంపాదించినందువల్ల ఈ రాశివారు విదేశాల్లో సైతం ఆస్తులు సంపాదించుకునే అవకాశం ఉంది. స్థిరాస్తులు విస్తరిస్తాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తిపాస్తుల క్రయ విక్రయాల్లో అంచనాలకు మించి లాభపడతారు. అన్ని వైపుల నుంచి లాభాలు పెరుగుతాయి. సొంత ఇంటి యోగంతో పాటు వాహన యోగం కూడా పడుతుంది. తండ్రి వైపు నుంచి సంపద కలిసి వస్తుంది. విదేశీ సంపాదన యోగం కలుగుతుంది.
మకర రాశి
ఈ రాశికి చతుర్థ, లాభాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో కలవడం వల్ల స్థిరాస్తులు వృద్ధి చెందడం, స్థిరాస్తుల విలువ పెరగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై, భూలాభం, ఆస్తి లాభం కలుగుతుంది. ఒకటి రెండు ధనయోగాలు కలుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులే షన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
మీన రాశి
ఈ రాశికి ధన, భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన కుజుడు పంచమ స్థానంలో గురువుతో కలవడం వల్ల ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా ఈ రాశివారు బాగా లబ్ధి పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారి కార్యకలాపాలు, సంపద బాగా వృద్ధి చెందుతాయి. స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెంచడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కార మవుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. విదేశీ సంపాదన యోగం కలుగుతుంది.



