ISROలో ఉద్యోగం పొందే ఛాన్స్.. టెన్త్ నుంచి డిప్లొమా వరకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు
ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (IPRC), మహేంద్రగిరిలో 22 టెక్నికల్, నాన్-టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్-బి, ఫైర్‌మ్యాన్, కుక్-ఎ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 5, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, సంబంధిత డిప్లొమా అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు..

ఇస్రోలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (IPRC)లో తాత్కాలిక/పర్మినెంట్ ప్రాతిపదికన టెక్నికల్, నాన్-టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 22 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబరు 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇస్రోలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు..
- టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 5
- టెక్నీషియన్-బి పోస్టుల సంఖ్య: 13
- ఫైర్‌మ్యాన్ పోస్టుల సంఖ్య: 3
- కుక్-ఎ పోస్టుల సంఖ్య: 1
పోస్టును బట్టి అభ్యర్థులు టెన్త్, ఐటీఐ లేదా సంబంధిత ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఫస్ట్ క్లాస్ డిప్లొమా అవసరం. అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి వయోపరిమితిలో సడలింపులు వర్తించే అవకాశం ఉంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 5, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది. పోస్టును బట్టి ఎంపిక ప్రక్రియలో నిబంధనలు మారవచ్చు. ఎంపికైన వారికి నెలకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు, టెక్నీషియన్-బి పోస్టులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు, ఇతర పోస్టులకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతంగా చెల్లిస్తారు. ISROలో ఉద్యోగం సాధించాలనుకునే టెన్త్, ఐటీఐ, డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఇస్రోలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




