AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీవ్ర విషాదం.. గణేష్ మండపంలో పూజలు చేస్తూ కుప్పకూలిన పూజారి..!

గణేష్ ఉత్సవాల సందర్భంగా చోటుచేసుకున్న వాగ్వాదం విషాదానికి దారితీసింది. నల్గొండ జిల్లా తిరుమలగిరిసాగర్ మండలం చింతలపాలెం గ్రామంలో గణేష్ మండపం వద్ద పూజారి మృతి చెందడం కలకలం రేపింది. పూజారి దత్తు ప్రసాద్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తీవ్ర విషాదం..  గణేష్ మండపంలో పూజలు చేస్తూ కుప్పకూలిన పూజారి..!
Ganesh Utsav Tragedy
M Revan Reddy
| Edited By: |

Updated on: Sep 14, 2026 | 8:37 PM

Share

నల్గొండ జిల్లా: గణేష్ ఉత్సవాల సందర్భంగా చోటుచేసుకున్న వాగ్వాదం విషాదానికి దారితీసింది. నల్గొండ జిల్లా తిరుమలగిరిసాగర్ మండలం చింతలపాలెం గ్రామంలో గణేష్ మండపం వద్ద పూజారి మృతి చెందడం కలకలం రేపింది. పూజారి దత్తు ప్రసాద్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపాలెం గ్రామంలోని గణేష్ మండపం వద్ద పూజలు నిర్వహించే విషయంలో దత్తు ప్రసాద్‌తో ఇద్దరు వ్యక్తులు వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ముందుగా తమ మండపం వద్ద పూజలు నిర్వహించాలంటూ ఇరువర్గాల మధ్య వివాదం మొదలైంది. అనంతరం దత్తు ప్రసాద్ గణేష్ మండపం వద్ద పూజలు నిర్వహించిన కొద్దిసేపటికే ఒక్కసారిగా స్పృహ తప్పి కుప్పకూలిపోయారు. దీంతో అక్కడున్న వారు వెంటనే ఆయనను సాగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే దత్తు ప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పూజారి మృతికి అసలు కారణం ఏమిటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వాగ్వాదం జరిగిన తర్వాతే ఆయన కుప్పకూలడంతో ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయన మృతికి ఖచ్చితమైన కారణం వైద్య పరీక్షలు, పోలీసుల దర్యాప్తు అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది.

మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వాగ్వాదానికి దారితీసిన పరిస్థితులు, అందులో పాల్గొన్న వ్యక్తులు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన వివరాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us