బిగ్ బాస్‌లో ఆమెదే హవా.. కట్టిపడేస్తున్న గ్లామరస్ బ్యూటీ..
Rajitha Chanti
Pic credit - Instagram
14 September 2026
పాపులర్ రియాలిటీ షో 'బిగ్‌బాస్' ద్వారా బుల్లితెర వీక్షకులకు మరింత దగ్గరైన నటి దేబ్జాని మోదక్. తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు సుపరిచితమే.
దేబ్జాని మోదక్
తన ప్రత్యేకమైన శైలి, నటన, అందంతో ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆమె అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
దేబ్జాని మోదక్
కోల్‌కతాకు చెందిన దేవజాని తన మోడలింగ్ కెరీర్‌తో గ్లామర్ రంగంలోకి ప్రవేశించింది. మోడలింగ్ తర్వాత బుల్లితెరపై నటిగా ప్రయాణం ప్రారంభించింది.
దేబ్జాని మోదక్
బెంగాలీ సీరియల్స్ ద్వారా నటనను మొదలుపెట్టి దక్షణాది బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ, తెలుగు సీరియళ్లలో నటించి ప్రేక్షకలకు దగ్గరైంది.
దేబ్జాని మోదక్
దేబ్జాని స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ చెప్పే విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. సీరియళ్లలో వైవిధ్యమైన పాత్రలు పోషించి నటిగా తనదైన ముద్ర వేసింది.
దేబ్జాని మోదక్
క్యారెక్టర్ ఏదైనా సరే, అందులో ఒదిగిపోయి నటించడం ఆమెలోని గొప్ప ప్లస్ పాయింట్. బిగ్‌బాస్ షోలో దేబ్జాని ఎంట్రీ ఇవ్వగానే వీక్షకుల దృష్టి ఆమెపై పడింది.
దేబ్జాని మోదక్
హౌస్‌లోని ఇతర పోటీదారులతో మెలిగే తీరు, టాస్క్‌లలో చూపిస్తున్న ఉత్సాహం, నిజాయితీ గల ప్రవర్తన ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
దేబ్జాని మోదక్
వివాదాలకు దూరంగా ఉంటూ, సందర్భోచితంగా తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పే విధానం ఆమెకు ప్లస్ అయ్యింది. ప్రస్తుతం బిగ్ బాస్ లో ఆమెదే హావా.