పాము కాటుకి సరికొత్త విరుగుడు! 100 ఏళ్ల సమస్యకి చెక్!
పాము కాటుకు చికిత్సలో కొత్త ఆశాకిరణం కనిపిస్తోంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డెన్మార్క్ టెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రీకాంబినెంట్ నానోబాడీ ఆధారిత యాంటీవెనమ్‌ను అభివృద్ధి చేసినట్లు సమాచారం. జంతువుల రక్తంపై ఆధారపడకుండా ల్యాబ్‌లో తయారు చేయగల ఈ విరుగుడును ఎలుకలపై పరీక్షించగా ఆశాజనక ఫలితాలు కనిపించాయి. అయితే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యే వరకు దీన్ని సాధారణ చికిత్సగా ఉపయోగించలేము.
పాము కాటు.. ఈ మాట వింటేనే మనకి ఒళ్లు జలదరిస్తుంది! మన దేశంలో ప్రతి ఏటా వేల సంఖ్యలో ప్రజలు పాము కాటు వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. గత 100 ఏళ్లుగా పాము విషానికి మనం వాడుతున్న వైద్య పద్ధతిలో ఎలాంటి పెద్ద మార్పూ లేదు! కానీ ఇప్పుడు.. భారతీయ శాస్త్రవేత్తలు ఒక అద్భుతం చేశారు! పాము కాటుకు సరికొత్త, అత్యంత శక్తివంతమైన విరుగుడు ను కనుగొన్నారు! ఈ కొత్త విరుగుడుతో భవిష్యత్తులో ఒక్క ప్రాణం కూడా పోదు అంటున్నారు! అసలు ఏంటి ఈ కొత్త యాంటీవెనమ్? శాస్త్రవేత్తలు దీన్ని ఎలా తయారుచేశారు? అసలు ఇప్పటివరకు పాము విషానికి విరుగుడు ఎలా తయారు చేస్తున్నారో తెలుసా? గుర్రాలు లేదా గొర్రెల శరీరంలోకి కొద్దిమొత్తంలో పాము విషాన్ని ఎక్కించి.. వాటి రక్తంలో తయారయ్యే యాంటీబాడీలను వేరుచేసి యాంటీవెనమ్ తయారుచేసేవారు. అయితే.. ఈ శతాబ్దం నాటి పాత పద్ధతిలో చాలా లోపాలు ఉన్నాయి. జంతువుల రక్తం ఆధారంగా తయారు చేయడం వల్ల ఒక్కోసారి మనుషుల్లో అలర్జీలు, తీవ్రమైన అలసట వస్తాయి. అంతేకాదు..ఒక ప్రాంతంలోని నాగుపాము విషానికి పనిచేసే మందు.. ఇంకో ప్రాంతంలోని పాము కాటుకు పనిచేయకపోవచ్చు. అలాగే, నాణ్యతలో తేడాలు ఉండటం వల్ల తయారీ ఖర్చు కూడా చాలా ఎక్కువ! ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డెన్మార్క్ టెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేతులు కలిపారు! వీరు జంతువులకు పదేపదే విషం ఎక్కించే పనిలేకుండా.. ల్యాబ్‌లోనే బయోటెక్నాలజీ సాయంతో రీకాంబినెంట్ నానోబాడీ యాంటీవెనమ్ ను రూపొందించారు. ఒంటె జాతి జంతువుల్లో ఉండే ప్రత్యేకమైన యాంటీబాడీ భాగాలను సేకరించి, వాటి ఆధారంగా ఒక యాంటీబాడీ కాక్‌టెయిల్ ని తయారుచేశారు. ఇది మన దేశంలో ఎక్కువగా కనిపించే ప్రమాదకర పాముల విషాన్ని చాలా వేగంగా నిరోధిస్తుంది! శాస్త్రవేత్తలు ఈ కొత్త మందును ఎలుకలపై పరీక్షించారు. పాము విషం ఎక్కించిన 30 నిమిషాల తర్వాత ఈ విరుగుడు ఇచ్చినా కూడా.. పక్షవాతం, నరాల బలహీనత నుంచి ఎలుకలు చాలా వేగంగా కోలుకున్నాయి! ఈ కొత్త విరుగుడు వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాలు ఏంటంటే.. జంతువుల అవసరం లేకుండా ల్యాబ్‌లోనే బ్యాక్టీరియా వ్యవస్థల ద్వారా భారీ ఎత్తున తయారు చేయవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ దాదాపు ఉండవు! తక్కువ పరిమాణంలోనే ఇది విషాన్ని పూర్తిగా మట్టుబెడుతుంది. ల్యాబ్‌లో ఉత్పత్తి చేయడం వల్ల సామాన్యులకు కూడా చౌకగా అందుబాటులోకి వస్తుంది. ప్రపంచంలోనే పాము కాటు మరణాలు ఎక్కువగా సంభవించే మన భారతదేశానికి ఇది నిజంగా ఒక సంజీవని అని చెప్పవచ్చు! త్వరలోనే మనుషులపై ట్రయల్స్ పూర్తిచేసి ఈ మందును అందుబాటులోకి తీసుకురావడానికి పరిశోధకులు సిద్ధమవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సిబ్బందిపై కారం చల్లి బ్యాంకులో దోపిడీ..
కన్నబిడ్డల పట్ల కర్కశంగా మారుతున్న తల్లిదండ్రులు.. ఎందుకు?
Neena Gupta: 67ఏళ్ల వయసులో ప్రెగ్నెంటా..? ఇచ్చిపడేసిన ఒకప్పటి హీరోయిన్
Epic: ఎపిక్ సూపర్ కలెక్షన్స్.. డే1 ఎంతంటే?
Hanuman Ansh: త్రివిక్రమ్ తీసుకొస్తున్నారు సరే తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారు?
పాము కాటుకి సరికొత్త విరుగుడు! 100 ఏళ్ల సమస్యకి చెక్!
అయ్యో.. ఇదేం విడ్డూరం.. యువకుడి కడుపులో గర్భాశయం
2027లో ఏం జరగబోతోంది? బాబా వంగ జోస్యం
నది లేదు.. చుక్క వర్షం పడదు.. నిత్యం 3.7 కోట్ల మందికి మంచినీరు
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!

