ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం, బుద్ధారం గ్రామంలో ఓ శునకం జాతి వైరాన్ని మరిచి ఆకలితో ఉన్న పిల్లి పిల్లకు పాలిచ్చింది. స్థానికుడు మేళ్లచెరువు లక్ష్మయ్య పెంపుడు కుక్క ఈ అరుదైన దయ చూపింది. ఈ హృదయపూర్వక సంఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.