AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూటరా? త్రీ వీలరా? ఒక్కసారి చూస్తే కన్ఫ్యూజ్‌ అవుతారు! 100km రేంజ్‌తో BeiGo X4

BeiGo X4 Electric Trike.. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో కొత్త ప్రయోగాలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా Bengaluruకు చెందిన iGowise Mobility స్కూటర్, త్రీ-వీలర్ కలయికను గుర్తు చేసే BeiGo X4ను తీసుకొచ్చింది. రెండు చక్రాల వాహనంలా మలుపులు తిరిగే సౌలభ్యంతో పాటు మూడు చక్రాల స్థిరత్వాన్ని అందించేలా దీన్ని రూపొందించారు. నగర ప్రయాణాలకు ఇది కొత్త ఆప్షన్‌గా మారనుంది.

స్కూటరా? త్రీ వీలరా? ఒక్కసారి చూస్తే కన్ఫ్యూజ్‌ అవుతారు! 100km రేంజ్‌తో BeiGo X4
Beigo X4 Electric Trike
Nikhil
|

Updated on: Sep 14, 2026 | 8:30 PM

Share

సాధారణ స్కూటర్ కంటే స్టెబిలిటీ కావాలి.. త్రీ-వీలర్ కంటే బైక్‌లాంటి రైడింగ్ అనుభూతి కావాలనుకునేవారికి BeiGo X4 ఆసక్తికరంగా కనిపిస్తోంది. 100 కిలోమీటర్ల రేంజ్, Anti-Topple Tilting Technology, Triple-Disc Braking వంటి ప్రత్యేకతలతో వచ్చిన ఈ EV ప్రస్తుతం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. ప్రారంభ ధర కూడా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.

మూడు చక్రాలు..

iGowise Mobility విడుదల చేసిన BeiGo X4 ధర మొదటి 300 మంది కస్టమర్లకు రూ.1.25 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంది. Invite-only ఆఫర్ పూర్తయ్యాక ధర రూ.1.56 లక్షలకు చేరుతుంది. దీపావళి సమయానికి డెలివరీలు ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనంలో HomeSwft 72V ఆర్కిటెక్చర్‌తో పనిచేసే బ్యాటరీ వ్యవస్థ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే IDC ప్రకారం 100 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. సాధారణ ఇంటి పవర్ కనెక్షన్‌తో సుమారు 100 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.

భద్రతలో ప్రత్యేకత..

BeiGo X4లో Triple-Disc Combined Braking System (CBS) అందించారు. వెనుక రెండు చక్రాలు ఉండటం వల్ల మెరుగైన గ్రిప్, ట్రాక్షన్ లభిస్తాయి. ముఖ్యంగా Anti-Topple Tilting Technology ఈ వాహనానికి ప్రత్యేక ఆకర్షణ. మలుపుల్లో రైడర్‌తో కలిసి పైభాగం బైక్‌లా వంగుతుండగా, వెనుక చక్రాలు స్థిరత్వాన్ని అందిస్తాయి.

ఐదేళ్లకు పైగా R&D చేసిన iGowise Mobility 50కి పైగా ప్రోటోటైప్‌లను అభివృద్ధి చేసి పరీక్షించినట్లు తెలిపింది. భారత రోడ్లపై సుమారు 1.5 లక్షల కిలోమీటర్ల టెస్టింగ్ పూర్తిచేసినట్లు వెల్లడించింది. BeiGo X4కు ARAI, ICAT సర్టిఫికేషన్లు లభించాయి. CMVR నిబంధనలు, AIS-156 బ్యాటరీ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

Follow Us