కుక్కర్‌లోంచి నీరు బయటకు వస్తుందా? ఈ సింపుల్ టిప్స్‌తో సమస్యకు చెక్!

September 14, 2026

Subhash

ప్రెజర్ కుక్కర్‌లో వంట చేస్తున్నప్పుడు విజిల్‌తో పాటు నీరు కూడా బయటకు వస్తుంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

 కుక్కర్‌లోంచి నీరు

కుక్కర్‌లో అవసరానికి మించి నీరు పోస్తే ఒత్తిడి పెరిగినప్పుడు విజిల్‌తో పాటు నీరు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వండే పదార్థానికి సరిపడా నీటిని మాత్రమే పోయండి.

 నీటి పరిమాణం

కుక్కర్‌లో వంట చేసేటప్పుడు ఒక చుక్క నూనె వేయడం వల్ల నీరు బయటకు రాదు. అంతేకాదు, కొన్ని వంటల్లో ఆహారం అడుగున అంటుకోకుండా ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది.

కొద్దిగా నూనె వేయండి

కుక్కర్ సరిగ్గా సీల్ కాకపోయినా సమస్యలు రావచ్చు. అందుకే ప్రతి సారి వంటకు ముందు రబ్బర్ రింగ్ సరిగ్గా ఉందో లేదో చూడండి. పాడైపోయిన, గట్టిపడిన గాస్కెట్‌ను మార్చడం మంచిది.

కుక్కర్ రబ్బర్‌

వంట పూర్తయిన తర్వాత కుక్కర్ గాస్కెట్‌ను శుభ్రంగా ఉంచడం ముఖ్యం. ఉపయోగించిన తర్వాత రబ్బర్‌ను చల్లటి నీటిలో ఉంచడం లేదా కొంతసేపు ఫ్రీజర్‌లో ఉంచడం వల్ల దాని మన్నిక పెరగవచ్చని సూచిస్తోంది.

గాస్కెట్‌

కుక్కర్‌లో వంట చేసేటప్పుడు చల్లటి నీటిని ఉపయోగించడం వల్ల కూడా నీరు బయటకు రావడం తగ్గవచ్చని పేర్కొంది. వంటకానికి అవసరమైన నీటి పరిమాణాన్ని మాత్రం తప్పనిసరిగా పాటించాలి.

చల్లటి నీటితో

కుక్కర్ నుంచి నీరు వస్తుంటే ముందుగా నీటి పరిమాణం ఎక్కువగా ఉందా, గాస్కెట్ సరిగ్గా ఉందా, మూత సరిగ్గా లాక్ అయిందా వంటి విషయాలను పరిశీలించండి. 

ఇవి చెక్ చేయండి

కుక్కర్‌లో సరైన మోతాదులో నీరు వాడటం, గాస్కెట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయడం, కుక్కర్ భాగాలను శుభ్రంగా ఉంచడం ద్వారా నీరు బయటకు వచ్చే సమస్యను తగ్గించుకోవచ్చు. 

చిన్న జాగ్రత్త..