AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిట్టు కొట్టు.. కార్ పట్టు.. అంటున్న నిర్మాతలు

హిట్టు కొట్టు.. కార్ పట్టు.. అంటున్న నిర్మాతలు

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Sep 13, 2026 | 8:31 PM

Share

సినిమా హిట్‌ అయితే దర్శకులకు లగ్జరీ కార్లు గిఫ్ట్‌గా ఇవ్వడం టాలీవుడ్‌, కోలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌గా మారుతోంది. డీసీ హిట్‌ తర్వాత లోకేశ్‌ కనగరాజ్‌, అరుణ్‌ మాథేశ్వరన్‌, అనిరుధ్‌కు నిర్మాత కళానిధి మారన్‌ BMW కార్లు బహుమతిగా ఇచ్చారు. గతంలోనూ జైలర్‌ విజయానికి రజినీకాంత్‌, నెల్సన్‌, అనిరుధ్‌కు కార్లు అందించారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, కార్తీ, తేజ సజ్జా తదితరులు కూడా హిట్‌ సినిమాల సందర్భంగా దర్శకులను ఖరీదైన కార్లతో సర్‌ప్రైజ్‌ చేశారు.

హిట్టు కొట్టు.. కార్ పట్టు.. ఇదేంటి ఏదైనా కొత్త కాంటెస్ట్ రన్ చేస్తున్నారా అనుకోవద్దు.. ఇదెక్కడో బయట కాదు ఇండస్ట్రీలోనే రన్ అవుతున్న కాంటెస్ట్. హిట్టు ఇచ్చిన దర్శకులను గుర్తు పెట్టుకుని మరీ.. వాళ్లకు లగ్జరీ కార్లు ఇచ్చి తమ గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు హీరోలు, నిర్మాతలు. టాలీవుడ్‌తో పాటు తమిళంలోనూ ఇదే ట్రెండ్ నడుస్తుందిప్పుడు. చూస్తున్నారుగా.. డిసి సినిమా హిట్ తర్వాత హీరో లోకేష్ కనకరాజ్, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌లకు పిలిచి మరీ BMW కార్లను బహుమతిగా అందించి సర్‌ప్రైజ్‌ చేశారు నిర్మాత కళానిధి మారన్. తాళాలను స్వయంగా అందజేసి తన సంతోషాన్ని పంచుకున్నారు. గతంలో జైలర్ హిట్టైనపుడు కూడా మారన్ ఇలాగే రజినీతో పాటు అనిరుధ్, నెల్సన్‌కు కార్లు ఇచ్చారు. మన శంకరవరప్రసాద్ గారుతో బ్లాక్‌బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడికి అంతే ప్రేమతో రేంజ్ రోవర్ కార్ గిఫ్టుగా ఇచ్చారు చిరు. రీజినల్ సినిమాల్లో మొదటి 350 కోట్ల సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్టైంది. చిరు మాత్రమే కాదు.. గతేడాది OG టైమ్‌లో సుజీత్‌కు లగ్జరీ కారు ఇచ్చారు పవర్ స్టార్. తన కార్ అమ్మి జపాన్ షెడ్యూల్ పూర్తి చేసిన సుజీత్‌కు అదే కారు బహుమతిగా ఇచ్చారు పవన్. గతేడాది మిరాయ్ సినిమా హిట్‌కు గుర్తుగా హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి కార్లు ఇచ్చారు నిర్మాత విశ్వప్రసాద్. సత్యం సుందరం హిట్టైన తర్వాత దర్శకుడు ప్రేమ్ కుమార్‌కు ప్రేమతో కార్తీ ఖరీదైన కారిచ్చారు. అలాగే ఉప్పెన టైమ్‌లో బుచ్చిబాబుకు మైత్రి మూవీ మేకర్స్, బేబీ సమయంలో సాయి రాజేష్‌కు SKN లగ్జరీ కార్లు బహుమతులుగా ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సిబ్బందిపై కారం చల్లి బ్యాంకులో దోపిడీ..

కన్నబిడ్డల పట్ల కర్కశంగా మారుతున్న తల్లిదండ్రులు.. ఎందుకు?

Neena Gupta: 67ఏళ్ల వయసులో ప్రెగ్నెంటా..? ఇచ్చిపడేసిన ఒకప్పటి హీరోయిన్

Epic: ఎపిక్‌ సూపర్ కలెక్షన్స్‌.. డే1 ఎంతంటే?

Hanuman Ansh: త్రివిక్రమ్ తీసుకొస్తున్నారు సరే తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారు?

Follow Us