AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

728 కి.మీ రేంజ్​తో లగ్జరీ ఈవీ లాంచ్​ చేసిన ఆటోమొబైల్ దిగ్గజం.. ధర తెలిస్తే చుక్కలు కనబడతాయి

BMW i7 Facelift.. లగ్జరీ కార్ల విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న వేళ BMW భారత మార్కెట్లో కొత్త 2026 BMW i7 Faceliftను విడుదల చేసింది. రూ.1.95 కోట్ల ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ సెడాన్‌లో భారీ స్క్రీన్లు, విలాసవంతమైన సీట్లు, అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా 728 కిలోమీటర్ల వరకు రేంజ్ ఆకట్టుకుంటోంది.

728 కి.మీ రేంజ్​తో లగ్జరీ ఈవీ లాంచ్​ చేసిన ఆటోమొబైల్ దిగ్గజం.. ధర తెలిస్తే చుక్కలు కనబడతాయి
2026 Bmw I7 Facelift
Nikhil
|

Updated on: Sep 15, 2026 | 6:00 AM

Share

కోట్ల రూపాయల కారు.. అందులో 8K థియేటర్ స్క్రీన్, మసాజ్ సీట్లు, భారీ బ్యాటరీ ఉంటే ఎలా ఉంటుంది? BMW కొత్త i7లో లగ్జరీకి టెక్నాలజీని జోడించింది. 112.5kWh బ్యాటరీతో 728 కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఈ ఎలక్ట్రిక్ సెడాన్ భారత మార్కెట్లో మరింత ప్రీమియం ఎంపికగా నిలిచేలా రూపొందించారు.

కొత్త లుక్.. మరింత ప్రీమియం!

2026 BMW i7 Faceliftలో పాత మోడల్ డిజైన్‌ను కొనసాగిస్తూనే ముందు భాగంలో మార్పులు చేశారు. ఇల్యూమినేటెడ్ సరౌండ్‌తో కొత్త స్క్వేర్ తరహా కిడ్నీ గ్రిల్, రీడిజైన్ చేసిన LED హెడ్‌లైట్లు, కొత్త ఫ్రంట్ బంపర్ ఉన్నాయి. కొత్త అలాయ్ వీల్ డిజైన్ కూడా లభిస్తుంది. వెనుక భాగంలో కొత్త టెయిల్‌గేట్, స్మోక్డ్ లెన్స్‌తో కొత్త LED టెయిల్‌ల్యాంప్స్, రీడిజైన్ చేసిన రియర్ బంపర్ ఉన్నాయి. i7 M70 xDriveలో పెద్ద ఎయిర్ ఇన్‌టేక్, M బ్యాడ్జింగ్, 31-ఇంచుల అలాయ్ వీల్స్ ప్రత్యేకంగా ఉంటాయి.

8K థియేటర్ స్క్రీన్.. 728 కి.మీ రేంజ్!

కొత్త i7లో 17.9 ఇంచుల టచ్‌స్క్రీన్, 14.6 ఇంచుల ప్యాసింజర్ స్క్రీన్, BMW X OS, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto ఉన్నాయి. వెనుక ప్రయాణికుల కోసం భారీ 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్‌ను అందించారు. Dolby Atmos సపోర్ట్‌తో Bowers & Wilkins సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. మసాజ్, వెంటిలేటెడ్, హీటెడ్ సీట్లతో పాటు పనోరమిక్ గ్లాస్ రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, Level-2 ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి.

పవర్ విషయానికి వస్తే 112.5kWh బ్యాటరీ 728 కిలోమీటర్ల వరకు WLTP రేంజ్ అందిస్తుంది. గత మోడల్‌తో పోలిస్తే సుమారు 125 కిలోమీటర్ల అదనపు రేంజ్ లభిస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ 455 hp పవర్, 600 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 0-100 kmph వేగాన్ని 5.5 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం 210 kmph.భారత్‌లో BMW i7 Facelift ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.95 కోట్లుగా ఉంది.

Follow Us