సూది గుచ్చకుండా.. చుక్క రక్తం తీయకుండా.. 60 సెకన్లలోనే 60 రకాల ఆరోగ్య పరీక్షలు
సూది గుచ్చకుండా, రక్తం తీయకుండానే ఆరోగ్య పరీక్షలు చేసే ఏఐ సాంకేతికత గుంటూరు జిల్లా మంగళగిరిలో అందుబాటులోకి వచ్చింది. కెమెరా ముందు కొన్ని క్షణాలు నిలబడితే ముఖంలోని సూక్ష్మ మార్పులు, నాడి సంకేతాలను ఏఐ విశ్లేషిస్తుంది. అనంతరం ఐఓటీ సాంకేతికతతో కలిపి మొత్తం 60 రకాల ఆరోగ్య పరీక్షల ఫలితాలను డిజిటల్‌గా అందిస్తుందని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియకు సుమారు 60 సెకన్లు పడుతుంది. ప్రస్తుతం మంగళగిరిలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.
సూది గుచ్చాల్సిన పనిలేదు.. చుక్క రక్తం తీయాల్సిన అవసరం అంతకంటే లేదు..! కేవలం మీ ముఖాన్ని స్కాన్ చేస్తే చాలు.. 60 సెకన్లలోనే 60 రకాల ఆరోగ్య పరీక్షల నివేదికలు మీ చేతుల్లోకి వస్తాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ అత్యధునిక AI సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఒకే ఒక్క నిమిషంలో హెల్త్ రిపోర్ట్స్ ఇచ్చే ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక టెక్నాలజీతో వైద్యం అందించే లక్ష్యంతో కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏఐ సేవలను వినియోగంలోకి తీసుకొస్తోంది. రక్త నమూనాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే వైద్య పరీక్షలు నిర్వహించే విధానం అందుబాటులోకి తెచ్చింది. గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల తర్వాత.. ఈ వినూత్న విధానాన్ని అమలు చేస్తున్న మూడో రాష్ట్రంగా ఏపీ నిలిచింది. మంగళగిరిలోని ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యాధునిక ‘ఏరోస్ వెల్‌నెస్ ఏఐ క్లినిక్’ను అధికారులు ప్రారంభించారు. అసలు ఈ ఏఐ ఫేస్ స్కానింగ్ ఎలా పనిచేస్తుందంటే.. కెమెరా ముందు కొన్ని క్షణాలు ఉండగానే.. నాడి సంకేతాలతోపాటు ముఖంలో కనిపించే అతి సూక్ష్మమైన మార్పులను ఏఐ విశ్లేషిస్తుంది. రక్తం బొట్టు బయటకు తీయకుండానే ప్రాథమికంగా 28 రకాల పరీక్షల ఫలితాలను గుర్తిస్తుంది. ఆ తర్వాత ఐఓటీ సాంకేతికతతో అనుసంధానించి ఇంకో 32 రకాల వైద్య పరీక్షలు చేసి డిజిటల్ రూపంలో కళ్ల ముందు ఉంచుతుంది. ఈ ప్రక్రియకు పట్టే సమయం కేవలం 60 సెకన్లు. అంటే 60 సెకన్ల వ్యవధిలోనే 60 రకాల రిపోర్టులు డిజిటల్ రూపంలో సిద్ధమవుతాయి. ఈ సరికొత్త ఏఐ క్లినిక్ ద్వారా బీపీ, మధుమేహం, గుండె జబ్బులతో పాటు పలు దీర్ఘకాలిక వ్యాధులను ప్రాథమిక దశలోనే సులభంగా పసిగట్టవచ్చు. దీని ద్వారా ప్రాణాపాయం రాకుండా ముందుగానే అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మంగళగిరిలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ ట్రయల్ రన్ చేపట్టారు. ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతమైతే.. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌ను మరింత విస్తరించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సిబ్బందిపై కారం చల్లి బ్యాంకులో దోపిడీ..
కన్నబిడ్డల పట్ల కర్కశంగా మారుతున్న తల్లిదండ్రులు.. ఎందుకు?
Neena Gupta: 67ఏళ్ల వయసులో ప్రెగ్నెంటా..? ఇచ్చిపడేసిన ఒకప్పటి హీరోయిన్
Epic: ఎపిక్ సూపర్ కలెక్షన్స్.. డే1 ఎంతంటే?
Hanuman Ansh: త్రివిక్రమ్ తీసుకొస్తున్నారు సరే తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారు?
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!
వలలో చిక్కిన 23 కేజీల "పండుగప్ప".. వేలంలో కళ్లుచెదిరే రేటు!
ఇక గోరింటాకు కూడా మెషీన్‌తోనే.. మరికొన్ని ఉద్యోగాలు హుష్!
పాము కాటుకి సరికొత్త విరుగుడు! 100 ఏళ్ల సమస్యకి చెక్!
అయ్యో.. ఇదేం విడ్డూరం.. యువకుడి కడుపులో గర్భాశయం

