హీరో గ్లామర్ X 125 కొత్త వేరియంట్ అదనపు భద్రత సహా స్పెషల్ ఫీచర్లు ఇవే
Hero Glamour X 125.. 125సీసీ బైక్ కొనుగోలు చేసేవారికి భద్రత కీలక అంశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో Hero MotoCorp తన Glamour X 125లో కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఇప్పటివరకు డ్రమ్, డిస్క్ బ్రేక్ ఆప్షన్లలో లభించిన ఈ బైక్‌కు ఇప్పుడు సింగిల్-ఛానల్ ABSను జోడించింది. కొత్త వేరియంట్ ధర రూ.1.01 లక్షలుగా నిర్ణయించింది.

బైక్ ధరలో పెద్దగా మార్పు లేకుండానే అదనపు భద్రతా ఫీచర్ కావాలనుకునేవారికి Hero Glamour X 125 కొత్త ఎంపికగా నిలవనుంది. డిస్క్ వేరియంట్ కంటే కేవలం రూ.1,000 అదనంగా చెల్లిస్తే సింగిల్-ఛానల్ ABS లభిస్తుంది. ABSతో పాటు IBS, మూడు రైడింగ్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి.
బ్రేకింగ్‌లో అదనపు భద్రత!
Hero Glamour X 125 కొత్త వేరియంట్‌లో సింగిల్-ఛానల్ ABSతో పాటు Integrated Braking System (IBS)ను అందించారు. అకస్మాత్తుగా గట్టిగా బ్రేక్ వేసినప్పుడు ముందు చక్రం లాక్ అయ్యే అవకాశాన్ని ABS తగ్గిస్తుంది. దీంతో రైడర్‌కు బైక్‌పై నియంత్రణ మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. IBS ముందు, వెనుక బ్రేకింగ్‌ను సమన్వయం చేయడంలో సహాయపడుతుంది. నగరాల్లో రోజువారీ ప్రయాణాల సమయంలో అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.
డిస్క్ కంటే రూ.1,000 మాత్రమే ఎక్కువ!
Glamour X 125 డ్రమ్ వేరియంట్ ధర రూ.89,999గా ఉంది. డిస్క్ వేరియంట్ ధర రూ.99,999. ఇప్పుడు కొత్త ABS వేరియంట్ ధర రూ.1.01 లక్షలు. అంటే డిస్క్ మోడల్‌తో పోలిస్తే కేవలం రూ.1,000 అదనంగా చెల్లిస్తే ABS భద్రత లభిస్తుంది. ఈ బైక్‌లో 125సీసీ ఇంజన్ 11.4 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. మూడు రైడింగ్ మోడ్‌లు ఉండటంతో రైడర్ అవసరానికి అనుగుణంగా పనితీరును ఎంచుకోవచ్చు. క్రూయిజ్ కంట్రోల్, కనెక్టెడ్ ఫీచర్లు కూడా కొనసాగించారు.
125సీసీ విభాగంలో TVS Raider 125, Honda CB125 Hornet వంటి మోడళ్లకు ABS అందుబాటులో ఉంది. Hero Xtreme 125Rలో డ్యూయల్-ఛానల్ ABS ఆప్షన్ కూడా ఉంది. దీంతో Glamour X 125లో ABS పరిచయం చేయడం ద్వారా ఈ విభాగంలో పోటీ మరింత పెరగనుంది.
