AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Voter ID Transfer: మీ ఓటరుకార్డులో అడ్రస్ మార్చాలా? సింపుల్ టిప్స్‌తో ఇంట్లోంచే అడ్రస్ అప్‌డేట్

కొంతమంది కొత్త నివాస ప్రాంతాలకు వెళ్లినా ఇప్పటివరకూ ఓటు గుర్తింపు కార్డులో అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోలేదు. సింపుల్‌గా వెళ్లిన చోట కొత్త ఓటు అప్లయ్ చేస్తున్నారు. అయితే ఆ అప్లికేషన్ తిరస్కరణకు గురవుతుంది. ఓటు గుర్తింపు కార్డుతో ఆధార్ జత కావడంతో ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం ఇంట్లో నుంచే మన ఓటర్ ఐడీను కొత్త అడ్రస్‌తో అప్‌డేట్ చేయవచ్చు. గతంలో నియోజకవర్గ పరిధిలోన అడ్రస్ అప్‌డేట్‌కు అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం దేశంలోని ఏ ప్రాంతానికైనా ఓటు కార్డును బదిలీ చేసుకునే అవకాశం కల్పించింది.

Voter ID Transfer: మీ ఓటరుకార్డులో అడ్రస్ మార్చాలా? సింపుల్ టిప్స్‌తో ఇంట్లోంచే అడ్రస్ అప్‌డేట్
Voter Id
Nikhil
|

Updated on: Mar 06, 2024 | 4:30 PM

Share

ప్రస్తుతం భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా మంది ఓటు గుర్తింపు కార్డులతో సిద్ధం అవుతున్నారు. అయితే కొంతమంది కొత్త నివాస ప్రాంతాలకు వెళ్లినా ఇప్పటివరకూ ఓటు గుర్తింపు కార్డులో అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోలేదు. సింపుల్‌గా వెళ్లిన చోట కొత్త ఓటు అప్లయ్ చేస్తున్నారు. అయితే ఆ అప్లికేషన్ తిరస్కరణకు గురవుతుంది. ఓటు గుర్తింపు కార్డుతో ఆధార్ జత కావడంతో ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం ఇంట్లో నుంచే మన ఓటర్ ఐడీను కొత్త అడ్రస్‌తో అప్‌డేట్ చేయవచ్చు. గతంలో నియోజకవర్గ పరిధిలోన అడ్రస్ అప్‌డేట్‌కు అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం దేశంలోని ఏ ప్రాంతానికైనా ఓటు కార్డును బదిలీ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన ఓటు గుర్తింపు కార్డులో అడ్రస్‌ను ఎలా మార్చాలో? ఓ సారి తెలుసుకుందాం. 

చిరునామా మార్చడానికి ఇవి తప్పనిసరి

  • మీరు ఉద్యోగ, వ్యాపార రీత్యా కొత్త ప్రాంతానికి మారితే మీ పేరు కూడా మీ మునుపటి అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల జాబితా నుంచి మీ కొత్త అసెంబ్లీ నియోజకవర్గానికి బదిలీ చేసుకోవాలి. ముఖ్యంగా అర్హులైన ఓటరు తమ పేరు ఉన్న ఓటర్ల జాబితా ఉన్న నియోజకవర్గంలో మాత్రమే ఓటు వేయగలరు.
  • డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్ మొదలైన చిరునామాకు సంబంధించి చెల్లుబాటు అయ్యే రుజువులు.
  • ఆధార్, పాన్ కార్డ్ మొదలైన చెల్లుబాటయ్యే గుర్తింపు రుజువు.
  • రెండు తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లు.
  • ఇప్పటికే ఉన్న ఓటర్ ఐడీ కార్డ్ కాపీ (రెండు వైపులా).

ఆన్‌లైన్‌లో మీ ఓటర్ ఐడీ అడ్రస్ మార్చుకోవడం ఇలా

  • ఓటరు సేవా పోర్టల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 
  • “ఫారమ్ 8ని పూరించండి” లింక్‌పై క్లిక్ చేసి, సైన్ అప్ చేయాలి. మీ ఆధారాలను ఉపయోగించి లాగిన్ చేయాలి. అవసరమైన వ్యక్తిగత మరియు నియోజకవర్గ సంబంధిత వివరాలను నమోదు చేయాలి.
  • అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. గుర్తింపు రుజువు, చిరునామా రుజువు, పాస్‌పోర్ట్-పరిమాణ ఫోటోగ్రాఫ్‌లు, ఇప్పటికే ఉన్న ఓటర్ ఐడీ కాపీలను అప్‌లోడ్ చేయాలి. 
  • చివరగా మీరు అందించిన సమాచారాన్ని ధ్రువీకరించి, మీ అభ్యర్థనను సమర్పించాలి. 

ఆఫ్‌లైన్‌లో చిరునామా మార్పు ఇలా

ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా మీ ఓటరు ఐడీ కార్డ్‌లోని శాశ్వత చిరునామాను మార్చడానికి ఓటర్ సేవా పోర్టల్ నుంచి “ఫారం 8″ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అవసరమైన వివరాలను పూరించి, సంబంధింత పత్రాలతో ఫారమ్‌ను సంబంధిత అధికారులకు సమర్పించాలి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి