Multibagger Return: లక్షను ఏడాదిలో రూ.2.27 లక్షలు చేసిన హోటల్ స్టాక్..
Multibagger Return: మెట్రో నగరాల్లో హోటళ్ల వ్యాపారం నిర్వహిస్తున్న ఈ కంపెనీ పెట్టుబడిదారులకు ఏడాదిలో మంచి రిటర్న్స్ అందించింది.
Multibagger Return: మెట్రో నగరాల్లో హై ఎండ్ హోటల్స్ చైన్ ను నడిపే ఛాలెట్ హోటల్స్(Chalet Hotel) లిమిటెడ్ తన పెట్టుబడిదారులకు మల్టిబ్యాగర్ రిటర్న్స్ అందించింది. S&P BSE- 500కి మించి 5 శాతం ఎక్కువ రాబడిని ఈ కంపెనీ షేరు ఇచ్చింది. ఏప్రిల్ 19, 2021న రూ.135.5గా ఉన్న కంపెనీ స్టాక్ రేటు.. ఏప్రిల్ 18, 2022 నాటికి రూ.301.50కి పెరిగింది. సుమారు ఏడాది కాలంలో పెట్టుబడిదారులకు 127 శాతం రాబడిని అందించింది. ఏడాది కాలంలో S&P BSE- 500 కేవలం 25.32 శాతమే రిటర్నులను(Return) అందించింది. ఒక వ్యక్తి ఛాలెట్ హోటల్స్ స్టాక్స్‌లో ఏడాది కిందట లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే.. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం దాని విలువ రూ.2.27 లక్షలుగా ఉండేది. ముంబై మెట్రోపాలిటన్ రీజన్, హైదరాబాద్, బెంగళూరు, పూణే ప్రాంతాల్లో కంపెనీ హోటల్స్‌ను నిర్వహిస్తోంది. 2,554 గదులు కలిగిన ఏడు హోటల్స్‌ను ఈ మల్టి బ్యాగర్ స్టాక్ ఆపరేట్ చేస్తోంది. ఇవి ప్రధానంగా లగ్జరీ సెగ్మెట్లలోనే తన సేవలను అందిస్తోంది. హాస్పిటాలిటీ ప్రాపర్టీలకు దగ్గర్లో 0.9 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు కమర్షియల్ స్పేస్ కంపెనీ వద్ద ఉంది.
కంపెనీ పోర్టుఫోలియోలో ప్రధానంగా.. ముంబై సహర్ లోని జేడబ్ల్యూ మారియట్, ముంబై పోవాయ్ లేక్ వద్ద ఉన్న ది వెస్టిన్, లేక్‌సైడ్ ఛాలెట్ మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్, నవీ ముంబైలోని షెరటాన్ ఫోర్ పాయింట్స్, హైదరాబాద్ మైండ్‌స్పేస్ లోని ది వెస్టిన్, బెంగళూరు వైట్‌ఫీల్డ్ లోని మారియట్ హోటల్, పూణే నగర్ రోడ్డు వద్ద ఉన్న నోవోటెల్ హోటెళ్లు ఉన్నాయి.
2022 ఆర్థిక సంవత్సరం మూడవ క్వర్టర్ లో వెల్లడించిన ఫలితాల్లో కంపెనీ నికర రెవెన్యూ వార్షికంగా 98.97 శాతం పెరిగింది. క్వార్టర్ పరంగా 27.89 శాతం పెరిగి రూ.164.18 కోట్లుగా నమోదైంది. కానీ.. కంపెనీ ఈ క్వార్టర్‌లో రూ.9.10 కోట్ల నష్టాన్ని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఛాలెట్ హోటల్స్ కంపెనీ షేర్లు 0.76 శాతం పెరిగి రూ.303.20 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఛాలెట్ హోటల్స్ స్టాక్ 52 వారాల గరిష్ఠం రూ.332.15 కాగా.. 52 వారాల కనిష్ఠం రూ.125.05గా ఉంది.
ఇవీ చదవండి..
Mukesh Ambani Birthday: ముఖేష్ అంబానీ బర్త్‌డే స్పెషల్.. ఆయన జీవితంలోని అరుదైన విశేషాలు మీకోసం..
Glass Bridge: డ్రాగన్ ను తలదన్నేలా అద్భుత కట్టడం.. పొడవైన గాజు వంతెన ఎక్కడ ఉందంటే..