Glass Bridge: డ్రాగన్ ను తలదన్నేలా అద్భుత కట్టడం.. పొడవైన గాజు వంతెన ఎక్కడ ఉందంటే..

ప్రపంచం వింతల్లోకి కొత్తగా మరొకటి వచ్చి చేరబోతోంది. పర్యాటకులను ఎంతగానో ఆకర్షించేందుకు ఆ దేశం చైనాకు మించిన కట్టడాన్ని చేసింది. ప్రపంచంలోనే అతిపొడవైన గాజు వంతెనను నిర్మించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

Glass Bridge: డ్రాగన్ ను తలదన్నేలా అద్భుత కట్టడం.. పొడవైన గాజు వంతెన ఎక్కడ ఉందంటే..
Longest Glass Bridge
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 19, 2022 | 12:53 PM

Glass Bridge: వియత్నాం(Vietnam)లోని ఉత్తర హైలాండ్స్ టౌన్ మోక్ చౌలో 2,073.5 అడుగుల పొడవైన గాజు వంతెన(Longest Glass Bridge).. ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెనగా నిలవనుంది. ఇది స్థానికులు, పర్యాటకుల సందర్శన కోసం త్వరలో అందుబాటులోకి రానుంది. ‘బాచ్ లాంగ్’ పేరుతో ఉన్న వంతెన వియత్నాంలో జాతీయ సెలవు దినం అయిన ఏప్రిల్ 30న పునరేకీకరణ దినోత్సవం నాడు ప్రజల కోసం తెరవబడుతోంది. సోన్ లా ప్రావిన్స్‌లోని మోక్ చౌ ఐలాండ్ టూరిస్ట్ ఏరియా అధికారులు.. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెనగా అధికారిక గుర్తింపు కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు వివరాలు సమర్పించినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ.. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని జాంగ్‌జియాజీ గ్రాండ్ కాన్యన్‌పై 1,410.7 అడుగుల పొడవైన గాజు వంతెన పేరున ఈ రికార్డు ఉంది.

 

గాజు వంతెన ఫోటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో హలచెల్ చేస్తోంది. ఊహించిన విధంగానే ఆకట్టుకునే ఆర్కిటెక్చర్ కలిగిన గాజు వంతెన నెటిజన్లు, స్థానికులను ఆకట్టుకుంటోంది. హనోయి నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వంతెనను భూమికి దాదాపు 500 అడుగుల ఎత్తులో నిర్మించారు. దీనిని ప్రఖ్యాత ఫ్రెంచ్ కంపెనీ సెయింట్ గోబైన్ ఉత్పత్తి చేసిన సూపర్ టెంపర్డ్ గ్లాస్‌తో తయారు నిర్మించారు. ఈ ప్రదేశం దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న కేబుల్ కార్ సిస్టమ్‌ను కూడా నడుపనున్నట్లు తెలుస్తోంది. ఈ వంతెన ప్రారంభించిన తరువాత ఒకేసారి 500 మంది వంతెనపై నడిచేందుకు అనుమతించనున్నట్లు మోక్ చౌ ఐలాండ్ టూరిస్ట్ ఏరియా ప్రతినిధి హోయాంగ్ మాన్ డ్యూయ్ వెల్లడించారు.

2021లో చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని ఒక వంతెన ప్రజలను ఎంతగానో కలవరపెట్టింది. రుయీ గాజు వంతెన భూమి నుంచి 140 మీటర్ల ఎత్తులో ఉంది. అది కనిపించే తీరు కారణంగా దీనిని ‘బెండింగ్’ వంతెన అని పిలుస్తారు. ఈ వంతెన 2017లో తిరిగి ఆవిష్కరించబడింది మరియు 2020లో స్థానికులకు తెరవబడింది.

ఇవీ చదవండి..

Elon Musk: తన ట్విట్టర్ కొనుగోలు పూర్తైతే.. వారి జీతాల ఖర్చు సున్నా డాలర్లవుతుందన్న ఎలాన్ మస్క్..

UPI: డెబిట్ కార్డులపై RBI కీలక నిర్ణయం.. త్వరలో యూపీఐ ద్వారా ATMలలో డబ్బు ఉపసంహరణ..