Janani Suraksha Yojana: గర్భిణీలకు రూ. 6 వేలు ఆర్థిక సహాయం.. జననీ సురక్ష యోజన పథకం పూర్తి వివరాలు..
Janani Suraksha Yojana: గర్భిణీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను అమలు చేస్తోంది. వీటి ద్వారా తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ సంరక్షణ అందుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల్లో జననీ సురక్ష యోజన పథకం ఒకటి...
Janani Suraksha Yojana: పలు వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఆర్థికంగానూ, సామాజికంగానూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఇందులో భాగంగా మహిళల కోసం కూడా మోదీ ప్రభుత్వం పలు పథకాలను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే గర్భిణీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను అమలు చేస్తోంది. వీటి ద్వారా తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ సంరక్షణ అందుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల్లో జననీ సురక్ష యోజన పథకం ఒకటి. గర్భిణీలు, నవజాత శిశువుల ఆరోగ్యం కోసం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా మహిళలకు రూ. 6000 వేలు ఆర్థిక సహాయం అందుతుంది.
పిల్లలకు సరిపడా పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రసవం తర్వాత గర్భిణులకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందజేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి కచ్చితంగా ఆధార్డ్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, ఆసుపత్రి జారీ చేసిన డెలివరీ సర్టిఫికేట, యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలి. అప్లికేషన్‌ఫామ్‌తో ఈ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత డబ్బులు నేరుగా మహిళల ఖాతాల్లో జమ అవుతాయి.
ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆశా వర్కర్లను సంప్రదించాల్సి ఉంటుంది. ఆశా కార్యకర్తలు దరఖాస్తులను స్వీకరిస్తారు. గర్భిణీలు తమ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఆశా వర్కర్లను సంప్రదించాల్సి ఉంటుంది. గ్రామంలో ఆశా వర్కర్లు లేకపోతే గ్రామాధికారికి కలిస్తే సరిపోతుంది. డాక్యుమెంట్స్, బ్యాంకు ఖాతా వివరాలు అందించే సమయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జననీ సురక్ష యోజన పథకానికి సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..