AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్‌పై కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్.. ఆ నిబంధనల్లో పూర్తిగా మార్పులు.. బడ్జెట్‌లో కీలక ప్రకటన

ఈపీఎఫ్‌లో విషయంలో బడ్జెట్‌లో కేంద్రం కీలక ప్రకటన చేసింది. పీఎఫ్ ట్రస్టుల నిబంధనల్లో మార్పులు చేసింది. కొన్ని కంపెనీలు పీఎఫ్ ట్రస్టులను నిర్వహిస్తుండగా.. వీరికి యాజమాన్య చెల్లింపు నిబంధనల్లో సడలింపులు ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుందని తెలుస్తోంది.

EPFO: పీఎఫ్‌పై కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్.. ఆ నిబంధనల్లో పూర్తిగా మార్పులు.. బడ్జెట్‌లో కీలక ప్రకటన
Epfo
Venkatrao Lella
|

Updated on: Feb 02, 2026 | 9:12 AM

Share

ఈపీఎఫ్‌వో విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఉద్యోగులు, కంపెనీల యాజమాన్యాలకు ఉపయోగపడేలా అనేక సంస్కరణలు ప్రవేశపెడుతోంది. ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్లోని తమ నగుదును సులువుగా విత్ డ్రా చేసుకునేలా త్వరలో కొత్త సదుపాయాలు అందుబాటులోకి తీసుకురానుంంది. దీంతో పాటు పీఎఫ్ సొమ్మును సులభతంగా ఉపసంహరించుకునేలా అనేక నిబంధనలు సవరించింది. ఈ క్రమంలో ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పీఎఫ్ విషయంలో కేంద్రం పలు మార్పులు చేసింది. పీఎఫ్ ట్రస్టులు నిర్వహించే యాజమాన్యాలకు ఊరట కలిగించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

నిబంధనలు రద్దు

ఈపీఎఫ్ అవసరాల కోసం కొన్ని కంపెనీలు పీఎఫ్ ట్రస్టులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. వీటికి యాజమాన్యాలు చెల్లించే మొత్తాలకు సంబంధించి ఇప్పటివరకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ట్రస్టులకు యాజమాన్యాలు చెల్లించే పర్సెంటేజీ, సామ్యత ఇతర విషయాలపై పలు నిబంధనలు అమల్లో ఉన్నాయి. వీటిని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కంపెనీలు ఎప్పటినుంచో నిబంధనలు సవరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకోవడంతో పీఎఫ్ ట్రస్టులు నిర్వహించే కంపెనీలకు ఊరట కలగినట్లయింది. వ్యాపార కార్యకలాపాల్లో సానుకూలత తెచ్చేందుకు కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఒకరి ఆధ్వర్యంలోనే నిర్వహణ

ఇప్పటివరకు పీఎఫ్ ట్రస్టులకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్, ఈపీఎఫ్‌వో సంస్ధలు గుర్తింపునిచ్చాయి. కానీ ఒకరి నియంత్రణలోనే ఇవి కొనసాగితే బాగుంటుందనే నిర్ణయానికి కేంద్రం వచ్చింది. దీంతో తాజాగా తీసుకున్న నిర్ణయం అందుకు ఉపయోగపడుతుందని కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు పీఎఫ్ ట్రస్టులు నిర్వహించే కంపెనీలు ఉద్యోగి వాటా కంటే తక్కువ లేదా ఎక్కవగా యాజమాన్యాలు వాటాను అందించే అవకాశముంది. ఇక నుంచి యజమాని పీఎఫ్ చందా తక్కువ స్ధాయిలో ఉండకుండా చూస్తుంది. ఇప్పుడు యజమాని పీఎఫ్ సహకారాలపై పన్ను మినహాయింపులు కూడా ప్రకటించారు. ఇందుకోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్స్, ఇతర నిబంధనల చట్టం 1952లోని సెక్షన్ 17 కింద మినహాయింపులు ప్రకటించారు. ఇటీవల ఈపీఎఫ్‌లో కేంద్రం అనేక మార్పులకు శ్రీకారం చుడుతోంది. కఠినతరమైన నిబంధనలను సవరిస్తోంది.  ఏప్రిల్ 1 నుంచి యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా చేసుకునే సేవలను కల్పించనుంది. అలాగే ఉద్యోగుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఒక ఏఐ టూల్‌ను కూడా తీసుకురానుంది. అన్ని భాషల్లో ఈ టూల్ పనిచేయనుంది. పీఎఫ్ 3.0 వెర్షన్‌లో భాాగంగా ఈ మార్పులు చేస్తోంది