Cement Price: సామాన్యుడికి మరో షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సిమెంట్‌ కంపెనీలు.. ధరలు మరింత పెంపు!

కలలను సాకారం చేసుకోవాలని అందరికి ఉంటుంది. అందులో కొత్త ఇల్లు. ఇంటిని నిర్మించుకోవాలని కలలు కంటున్న ప్రజలకు షాకిచ్చేందుకు సిద్ధమయ్యాయి సిమెంట్‌..

Cement Price: సామాన్యుడికి మరో షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సిమెంట్‌ కంపెనీలు.. ధరలు మరింత పెంపు!
Cement Price
Follow us
Subhash Goud

|

Updated on: Oct 24, 2022 | 11:25 AM

కలలను సాకారం చేసుకోవాలని అందరికి ఉంటుంది. అందులో కొత్త ఇల్లు. ఇంటిని నిర్మించుకోవాలని కలలు కంటున్న ప్రజలకు షాకిచ్చేందుకు సిద్ధమయ్యాయి సిమెంట్‌ ధరలు. నిర్మాణ పనులు వేగం పెరగడంతో సిమెంట్‌ ధర పెరిగే అవకాశం ఉంది . ఇటీవలి కాలంలో సిమెంట్‌కు డిమాండ్‌ బాగా పెరగడంతో ధరలు పెంచాలనే ఆలోచనలో ఉన్నాయి కంపెనీలు. వర్షాకాలం ముగియడంతో ఇళ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. పలు ప్రభుత్వ పథకాల్లో కూడా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలు, నిర్మాణం వంటి రంగాల నుండి సిమెంట్‌కు బలమైన డిమాండ్ కనిపిస్తోంది . దీంతో రానున్న రోజుల్లో సిమెంట్ ధర మళ్లీ పెరిగే అవకాశం ఉంది.

ఇంతలో, ప్రపంచవ్యాప్తం సిమెంట్ తయారీ ఖర్చు పెరిగింది. ఖర్చుకు తగ్గట్టుగా ధరను పెంచే ఆలోచనలో సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. డిసెంబరు నాటికి సిమెంట్ కంపెనీలు వివిధ దశల్లో సిమెంట్ ధరను దాదాపు 6-8 శాతం వరకు పెంచవచ్చని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. ఇటీవల దాల్మియా సిమెంట్, జేకే సూపర్ సిమెంట్, అల్ట్రాటెక్ కంపెనీల సమావేశం జరిగింది. సెప్టెంబరు త్రైమాసికంలో వారి ఆదాయాలపై ప్రభావం పడిందని సమావేశంలో ఎత్తి చూపారు.

ఈ మూడు సిమెంట్ దిగ్గజాలు డిసెంబరు త్రైమాసికం నుండి పరిస్థితి మెరుగుపడే అవకాశాలను వ్యక్తం చేశాయి. సెప్టెంబరు త్రైమాసికంలో సగటు సిమెంట్ ధరలు 5.5 శాతం తగ్గాయని, అయితే ఇప్పుడు ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై ఖర్చు పెంచుతుందని, ఇది సిమెంట్ రంగానికి సహాయపడుతుందని బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ చెబుతోంది. రానున్న రోజుల్లో మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగం నుంచి సిమెంట్‌కు గట్టి డిమాండ్‌ వస్తుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ కూడా అభిప్రాయపడింది.

ఇవి కూడా చదవండి

వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది:

కంపెనీలు సిమెంట్ ధరను పెంచితే వినియోగదారులు రెండు రంగాల్లో ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి కొత్త ఇంటి నిర్మాణానికి ఖర్చు పెరుగుతుంది. కొత్త ఇల్లు కట్టుకోవాలంటే గతంలో కంటే ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. రెండవది పెరిగిన సిమెంట్ ధరలను పేర్కొంటూ బిల్డర్లు ఫ్లాట్ రేట్లను ఖరీదైనదిగా చేయవచ్చు. ఇది మొత్తం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం, ఖరీదైన రుణ రేట్ల కారణంగా రియల్ ఎస్టేట్‌పై ప్రభావం కనిపిస్తోంది. సిమెంట్ ధర పెరిగితే వినియోగదారులపై ఒత్తిడి మరింత పెరుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి