Bank FD Rates: ఆ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. ఎఫ్‌డీలపై పెరిగిన వడ్డీ రేట్లు..
91 నుంచి 184 రోజుల్లో మెచ్యూర్ అయ్యే FDలపై వడ్డీ రేటు 3.5 శాతంగా ఉండగా, బ్యాంక్ దానిని 3.60 శాతానికి పెంచింది. 185 నుంచి 270 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు 3.75 శాతంగా ఉంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డబ్బును ఇన్వెస్ట్ చేసే వారికి మంచి రోజులు రానున్నాయి. అన్ని బ్యాంకులు FD వడ్డీ రేట్లను పెంచాయి. చాలా బ్యాంకులు వడ్డీ రేటును రెండుసార్లు పెంచాయి. ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్, ప్రైవేట్ రంగ ICICI బ్యాంకులు కూడా FD వడ్డీ రేట్లను పెంచాయి. ఈ రెండు బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడంతో, పెట్టుబడిదారుల FDలపై మరిన్ని ప్రయోజనాలను పొందుతారు. రూ. 2 కోట్ల కంటే తక్కువ FD వడ్డీ రేట్లను పెంచిన తాజా బ్యాంక్‌గా కెనరా బ్యాంక్ అవతరించింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, కెనరా బ్యాంక్ FD పై పెరిగిన వడ్డీ రేట్లు మే 12, 2022 నుంచి అమలులోకి వస్తాయి. కెనరా బ్యాంక్ ప్రస్తుతం 7 నుంచి 45 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే FDలపై 2.90 శాతం వడ్డీని అందిస్తుంది.
Also Read: Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!
180 రోజుల నుంచి 269 రోజుల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీ లభిస్తుంది. ఒక సంవత్సరం ఎఫ్‌డిపై వడ్డీ రేటు 5.1 శాతానికి, రెండేళ్ల ఎఫ్‌డిపై వడ్డీ రేటు 5.15 శాతానికి సవరించారు. 270 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ కాలవ్యవధికి 4.55 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ లభిస్తుంది. కెనరా బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ వడ్డీ రేట్లు రికరింగ్ డిపాజిట్ (RD)పై కూడా వర్తిస్తాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది. అయితే రూ. 5 కోట్ల కంటే తక్కువ. ఈ మార్పు తర్వాత బ్యాంక్ ప్రస్తుతం 7 నుంచి 29 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇది గతంలో 2.75 శాతంగా ఉంది. ఇంతకుముందు 30 రోజుల నుంచి 60 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే FDలపై వడ్డీ రేటు 3 శాతంగా ఉంది. కానీ, ఇప్పుడు వడ్డీ రేటు 3.25 శాతంగా మారింది. 61 నుంచి 90 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై ఇంతకుముందు 3.25 శాతం వడ్డీ రేటు ఉండగా, ప్రస్తుతం దానిని 3.40 శాతానికి పెంచారు.
91 నుంచి 184 రోజుల్లో మెచ్యూర్ అయ్యే FDలపై వడ్డీ రేటు 3.5 శాతంగా ఉండగా, బ్యాంక్ దానిని 3.60 శాతానికి పెంచింది. 185 నుంచి 270 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు 3.75 శాతంగా ఉంది. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఐసీఐసీఐ బ్యాంక్ 271 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 4% వడ్డీ రేటును ఒక సంవత్సరం కంటే తక్కువ కాలవ్యవధికి 1 సంవత్సరం నుంచి 15 నెలల లోపు మెచ్యూరిటీ డిపాజిట్లపై 4.5 శాతంగా కొనసాగిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Petrol Diesel Price: వాహనదారులకు ఊరట.. తాజా పెట్రోల్, డీజిల్ ధరలు
Crypto Losses: ఊహించని స్థాయిలో కుప్పకూలిన ‘క్రిప్టో కరెన్సీ’.. తీవ్ర ఆందోళనలో ఇన్వెస్టర్లు..