IPL 2022: పేరుకే అన్ క్యాప్డ్ ప్లేయర్స్.. ఆటలో మాత్రం తోపులు.. బంతి విసిరితే బ్యాట్స్‌మెన్ బుర్ర తిరగాల్సిందే..

అన్‌క్యాప్ ఆటగాళ్ళు తమ కెరీర్‌లో అద్భుతంగా రాణిస్తూ, తమ సత్తా చాటుతున్నారు. వీరిలో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు ఉన్నారు. IPL 2022లో ప్రజల దృష్టిని ఆకర్షించే కొంతమంది అన్‌క్యాప్డ్ పేసర్లు కూడా ఈ లిస్టులో ఉన్నారు.

IPL 2022: పేరుకే అన్ క్యాప్డ్ ప్లేయర్స్.. ఆటలో మాత్రం తోపులు.. బంతి విసిరితే బ్యాట్స్‌మెన్ బుర్ర తిరగాల్సిందే..
Ipl 2022 Uncapped Indian Pace Bowlers
Follow us
Venkata Chari

|

Updated on: May 13, 2022 | 9:25 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ(IPL 2022) ఎడిషన్‌లో ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. చాలా మంది అన్‌క్యాప్(uncapped) ఆటగాళ్ళు తమ కెరీర్‌లో అద్భుతంగా రాణిస్తూ, తమ సత్తా చాటుతున్నారు. వీరిలో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు ఉన్నారు. IPL 2022లో ప్రజల దృష్టిని ఆకర్షించే కొంతమంది అన్‌క్యాప్డ్ పేసర్లు కూడా ఈ లిస్టులో ఉన్నారు. వీరంతా తమ ప్రతిభతో టీమిండియాలో చోటు కోసం కర్ఛీప్ వేసుకున్నారు. ఈ లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

Also Read: IPL 2022: 10 మ్యాచ్‌లు..116 పరుగులు.. ఫ్లాప్ షోలా మారిన రూ. 16 కోట్ల ప్లేయర్.. ఏకంగా టోర్నీ నుంచే ఔట్..

ఉమ్రాన్ మాలిక్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)..

ఉమ్రాన్ మాలిక్ ఈ సీజన్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారాడు. ఫాస్ట్ బౌలింగ్ సంచలనంగా పేరుగాంచిన ఎస్‌ఆర్‌హెచ్ ఎక్స్‌ప్రెస్ అతని పేస్, కచ్చితత్వంతో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అతను SRH కోసం నెట్ బౌలర్‌గా తన IPL స్టింట్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం జట్టు పేస్ అటాక్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మాలిక్ ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 24.26 సగటు, 9.10 ఎకానమీతో 15 వికెట్లు తీశాడు. ఈ పేసర్ దాదాపు 157 kmph వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. IPL 2022లో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన లిస్టులో నిలిచాడు.

మొహ్సిన్ ఖాన్ (లక్నో సూపర్ జెయింట్స్)..

లక్నో సూపర్ జెయింట్స్ తరపున భారత లెఫ్టార్మ్ పేసర్ మొహ్సిన్ ఖాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. యువ స్పీడ్‌స్టర్ కేవలం 6 గేమ్‌లలో 5.19 అద్భుతమైన ఎకానమీ రేటుతో 10 వికెట్లు తీశాడు.

యష్ దయాల్ (గుజరాత్ టైటాన్స్)..

ఈ జాబితాలో మరో యువ లెఫ్టార్మ్ పేసర్, యశ్ దయాల్ అరంగేట్రం చేశాడు. ఈ ప్లేయర్ గుజరాత్ టైటాన్స్ తరపున రాణిస్తున్నాడు. దయాల్ బంతిని రెండువైపులా స్వింగ్ చేయగలడు. అతను 9.44 ఎకానమీతో కేవలం ఐదు గేమ్‌లలో తొమ్మిది వికెట్లు తీశాడు.

ముఖేష్ చౌదరి (చెన్నై సూపర్ కింగ్స్)..

విజయ్ హజారే ట్రోఫీ 2021-22లో మహారాష్ట్ర తరపున ప్రధాన వికెట్ టేకర్‌గా నిలిచిన ముఖేష్ చౌదరి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తన వీరోచిత ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నాడు.

మెగా-వేలంలో రూ. 20 లక్షల బేస్ ధరకు CSK సంతకం చేసింది. ఈ లెఫ్టార్మ్ పేసర్ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటి వరకు పది మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.

అర్ష్‌దీప్ సింగ్ (పంజాబ్ కింగ్స్)..

అర్ష్‌దీప్ సింగ్‌కు తగినంత వికెట్లు లేకపోవచ్చు. కానీ, పంజాబ్ కింగ్స్ తరపున ఈ పేసర్ ఈ సీజన్‌లో ఎంతో పొదుపుగా బౌలింగ్ చేస్తూ ఆకట్టుకున్నాడు. ఎడమ-చేతి స్పీడ్‌స్టర్‌కు మ్యాచ్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏ దశలోనైనా పరుగుల వరదను నిరోధించే సామర్థ్యం ఉంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Watch Video: పిచ్‌పైనే కుప్పకూలిన స్టార్ ఆల్ రౌండర్.. షాకైన ఆటగాళ్లు.. అసలు ఏం జరిగిందంటే?

IPL 2022: ముంబై దెబ్బకు ఆ చెత్త రికార్డులో చేరిన చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్‌లో రెండోసారి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?