The World’s Highest Paid Athletes 2022: ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్లు.. లిస్టులో ఏకైక భారత క్రికెటర్..
ఫోర్బ్స్ వార్షిక జాబితాలో అమెరికా బాస్కెట్‌బాల్ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్, మాంచెస్టర్ యునైటెడ్‌కు చెందిన క్రిస్టియానోరొనాల్డో కంటే ఫ్రెంచ్ క్లబ్ PSG స్టార్ ఫార్వర్డ్ మెస్సీ ముందున్నాడు. మెస్సీ ఐరిష్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్ కోనార్ మెక్‌గ్రెగర్‌ను టాప్ నుంచి పడిపోయాడు.
The World’s Top 10 Highest Paid Athletes 2022: ఫోర్బ్స్ అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్ల జాబితాలో అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ(Lionel Messi) అగ్రస్థానంలో ఉన్నాడు. ఫోర్బ్స్ వార్షిక జాబితాలో అమెరికా బాస్కెట్‌బాల్ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్, మాంచెస్టర్ యునైటెడ్‌కు చెందిన క్రిస్టియానోరొనాల్డో కంటే ఫ్రెంచ్ క్లబ్ PSG స్టార్ ఫార్వర్డ్ మెస్సీ ముందున్నాడు. మెస్సీ ఐరిష్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్ కోనార్ మెక్‌గ్రెగర్‌ను టాప్ నుంచి పడిపోయాడు. గత 12 నెలల్లో మెస్సీ 130 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1007 కోట్లు) సంపాదించాడు. మెక్‌గ్రెగర్(McGregor) ఈసారి టాప్-10లో కూడా లేకపోవడం విశేషం.
Also Read: IPL 2022: పేరుకే అన్ క్యాప్డ్ ప్లేయర్స్.. ఆటలో మాత్రం తోపులు.. బంతి విసిరితే బ్యాట్స్‌మెన్ బుర్ర తిరగాల్సిందే..
ఈసారి అత్యధిక వసూళ్లు చేసిన 10 మంది ఆటగాళ్లు మొత్తం $992 మిలియన్లు (సుమారు రూ. 7688 కోట్లు) సంపాదించారు. 2021తో పోలిస్తే 6% క్షీణత నమోదైంది. ఈసారి టాప్-10 ఆటగాళ్ల మొత్తం సంపాదన మూడో అత్యధికంగా నిలిచింది. ఇది 2018లో $1.06 బిలియన్లు (సుమారు రూ.8210 కోట్లు)కాగా, 2021లో $1.05 బిలియన్లు (సుమారు రూ.8130 కోట్లు)గా ఉంది.
క్రికెట్‌లో బ్యాడ్ ఫేజ్‌ను ఎదుర్కొంటున్న అత్యంత సంపన్న క్రికెటర్..
విరాట్ కోహ్లీ సంపాదనకు లోటు లేదు. స్పోర్ట్స్ బిజినెస్ వెబ్‌సైట్ స్పోర్టికో విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ 61వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఉన్న ఏకైక క్రికెటర్, ఏకైక భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.
ఈ నివేదిక ప్రకారం, విరాట్ ఈ సంవత్సరం ప్రకటనలు, జీతం, ప్రైజ్ మనీ ద్వారా మొత్తం రూ. 262 కోట్లు ($ 33.9 మిలియన్లు) సంపాదించాడు. ఇందులో విరాట్ జీతం, ప్రైజ్ మనీ ద్వారా రూ.22 కోట్లు, ప్రకటనల ద్వారా మిగిలిన రూ.240 కోట్లు సంపాదించాడు.
Also Read: Watch Video: పిచ్‌పైనే కుప్పకూలిన స్టార్ ఆల్ రౌండర్.. షాకైన ఆటగాళ్లు.. అసలు ఏం జరిగిందంటే?