AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Accounts: ఒకే బ్యాంకులో రెండు ఖాతాలు ఉండవచ్చా..? లాభనష్టాలేంటో తెలిస్తే షాక్

భారతదేశంలో బ్యాంకింగ్ రంగం వేగంగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆధార్ ఆధారంగా బ్యాంకు ఖాతాలను ఇవ్వడం ప్రారంభించడంతో బ్యాంకు ఖాతాల సంఖ్య పెరిగింది. అయితే మనలో చాలా మంది ఒక వ్యక్తికి ఒక బ్యాంకులో ఒక ఖాతా ఉంటుందని అనుకుంటూ ఉంటాం. అయితే ఒకే బ్యాంకులో రెండు పొదుపు ఖాతాలను నిర్వహించే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. అయితే రెండు పొదుపు ఖాతాలు ఉండడం వల్ల లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో? నష్టాలు కూడా అదే విధంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Bank Accounts: ఒకే బ్యాంకులో రెండు ఖాతాలు ఉండవచ్చా..? లాభనష్టాలేంటో తెలిస్తే షాక్
Bank Accounts
Nikhil
|

Updated on: Aug 07, 2024 | 7:24 PM

Share

భారతదేశంలో బ్యాంకింగ్ రంగం వేగంగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆధార్ ఆధారంగా బ్యాంకు ఖాతాలను ఇవ్వడం ప్రారంభించడంతో బ్యాంకు ఖాతాల సంఖ్య పెరిగింది. అయితే మనలో చాలా మంది ఒక వ్యక్తికి ఒక బ్యాంకులో ఒక ఖాతా ఉంటుందని అనుకుంటూ ఉంటాం. అయితే ఒకే బ్యాంకులో రెండు పొదుపు ఖాతాలను నిర్వహించే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. అయితే రెండు పొదుపు ఖాతాలు ఉండడం వల్ల లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో? నష్టాలు కూడా అదే విధంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒకే బ్యాంకులో ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలను నిర్వహించవచ్చని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ఖాతాదారుడు కలిగి ఉండే పొదుపు ఖాతాల సంఖ్యపై చాలా బ్యాంకులు పరిమితులు విధించవు. ఈ సౌలభ్యం వ్యక్తులు బడ్జెట్ చేయడం, నిర్దిష్ట లక్ష్యాల కోసం ఆదా చేయడం లేదా వివిధ ఆదాయ మార్గాలను నిర్వహించడం వంటి వివిధ ప్రయోజనాల ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను బ్యాంకులు అందిస్తాయి. ఈ నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉండడం వల్ల కలిగే లాభనష్టాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

అధిక పొదుపు ఖాతాలతో లాభాలివే

ఆర్థిక నిర్వహణ

ఒకే బ్యాంకులో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండే మీ ఆర్థిక వ్యవస్థలను సులభంగా విభజించుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఖాతాను రోజువారీ ఖర్చుల కోసం ఉపయోగించవచ్చు, మరో ఖాతాను అత్యవసర నిధి వంటి నిర్దిష్ట లక్ష్యాల కోసం ఆదా చేయడానికి కేటాయించుకోవచ్చు.

వడ్డీ రేట్లు

బ్యాంకులు తరచూ వివిధ రకాలైన పొదుపు ఖాతాలకు వివిధ వడ్డీ రేట్లతో ప్రయోజనాలతో అందిస్తాయి. రెండు ఖాతాలను కలిగి ఉండటం ద్వారా మీరు అధిక వడ్డీ రేట్లు లేదా అదనపు ఫీచర్లను అందించే వివిధ పథకాల ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

భద్రత

సాంకేతిక సమస్యల వల్ల మీ ఖాతా ఆగిపోతే సెకండరీ ఖతా ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. అలాగే పొదుపు ఖాతాలో సొమ్మును ఉంచుకోవడం ద్వారా మన డబ్బుకు భద్రత ఉంటుంది. 

అధిక పొదుపు ఖాతాలతో నష్టాలివే

మేనేజ్‌మెంట్

అధిక పొదుపు ఖాతాలు ఉండడం వల్ల వాటిని నిర్వహించడంలో కొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు. బ్యాలెన్స్‌లు, లావాదేవీలు, ఖాతా స్టేట్‌మెంట్‌లను ట్రాక్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. రెండు ఖాతాలను పర్యవేక్షించడం అంటే రెండు సెట్‌ల స్టేట్‌మెంట్‌లపై నిఘా ఉంచడమేనని అందువల్ల ఖాతాలు నిర్వహణ వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

రుసుములు, చార్జీలు

కనీస బ్యాలెన్స్ అవసరాలను తీర్చకపోతే బ్యాంకులు నిర్వహణ రుసుములను వసూలు చేయవచ్చు. అన్ని ఖాతాలలో కనీస బ్యాలెన్స్ ప్రమాణాలు స్థిరంగా లేకపోతే బహుళ ఖాతాలకు జరిమానా పడవచ్చు. సాధారణంగా ప్రతి ఖాతాకు రూ. 10,000 కనీస బ్యాలెన్స్ అవసరమైతే ఈ బ్యాలెన్స్‌ను నిర్వహించడంలో విఫలమైతే నెలవారీ నిర్వహణ ఛార్జీలను బ్యాంకుల విధిస్తాయనే విషయం గమనించాలి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి