Phone Buying: వాయిదా పద్ధతిలో ఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
డీలర్ అతను ఐఫోన్‌ను వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేయవచ్చని చెప్పాడు. దానికోసం అతను వార్షిక వడ్డీ 24 శాతం చెల్లించాలి. మోహాన్ ఫోన్ కొనాలని నిర్ణయించుకున్నాడు. 3 సంవత్సరాలలో డబ్బు చెల్లిస్తానని డీలర్‌కు తెలియజేశాడు. డీలర్ 5,000 రూపాయల కంటే కొంచెం ఎక్కువ ఈఎంఐ (EMI)ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అతను 3 సంవత్సరాల పాటు ప్రతి నెలా ఈఎంఐ చెల్లించాలి..
మోహన్ మంత్లీ సాలరీ 35,000 రూపాయలు. అతను iPhone 15 Proని కొందామని అనుకుంటున్నాడు. దీని ధర సుమారుగా 1 లక్ష 35,000 రూపాయలు. అతను ఫోన్‌ని చూడటానికి మొబైల్ స్టోర్‌కి వెళ్లినప్పుడు, డీలర్ అతను ఐఫోన్‌ను వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేయవచ్చని చెప్పాడు. దానికోసం అతను వార్షిక వడ్డీ 24 శాతం చెల్లించాలి. మోహాన్ ఫోన్ కొనాలని నిర్ణయించుకున్నాడు. 3 సంవత్సరాలలో డబ్బు చెల్లిస్తానని డీలర్‌కు తెలియజేశాడు. డీలర్ 5,000 రూపాయల కంటే కొంచెం ఎక్కువ ఈఎంఐ (EMI)ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అతను 3 సంవత్సరాల పాటు ప్రతి నెలా ఈఎంఐ చెల్లించాలి.
ఈ పద్ధతిలో ఐఫోన్ కోసం లోన్ తీసుకోవడం చాలా సులభం. అయితే మోహన్ మూడేళ్ళలో 55,000 రూపాయల కంటే ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. 3 సంవత్సరాలలో 1 లక్ష 35,000 రూపాయల ఫోన్ కోసం, అతను మొత్తం 1 లక్ష 90,000 రూపాయలు చెల్లించాలి. డీలర్ ఎన్‌బీఎఫ్‌సీ ద్వారా లోన్ వచ్చేలా చేస్తాడు. మోహన్ పెద్దగా ఆలోచించకుండా అప్పు తీసుకున్నాడు. మీరు కూడా ఫోన్ కోసం లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే దానికోసం వెళ్లే ముందు మీరు లోన్ నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి. డీలర్ అందించే లోన్ ఫోన్‌ని కొనుగోలు చేయడానికి ఒక మార్గంగా మారింది. ఇది కాకుండా లోన్ ద్వారా ఫోన్‌ని కొనడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుందాం.
ముందుగా కస్టమర్ కి దొరికే లోన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి మొబైల్ ఫోన్‌లను కొనుగోలు చేయడానికి ఉపయోగించే పర్సనల్ లోన్స్. పర్సనల్ లోన్స్ వార్షిక వడ్డీ రేట్లు బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీ ఆధారంగా 8.75% నుంచి 49.5% వరకు ఉంటాయి. మీరు ఈ లోన్‌తో 6% వరకు ప్రాసెసింగ్ ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల ఈ విధంగా ఫోన్‌ను కొనుగోలు చేయడం చాలా ఖరీదైనది అని చెప్పవచ్చు.
మరొక రకమైన లోన్ గురించి చెప్పాలంటే, Amazon – Flipkart వంటి వెబ్‌సైట్‌లు ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి.. అంటే బై నౌ.. పే లేటర్ ఫీచర్‌తో క్రెడిట్‌పై ఫోన్‌ని కొనుగోలు చేసే ఆప్షన్ ఇస్తాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లు 60,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు క్రెడిట్ లిమిట్ సెట్ చేస్తాయి. తద్వారా మీరు అధిక విలువ కలిగిన ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. రుణ మొత్తాన్ని 3 నుంచి 12 నెలలలోపు వాయిదాలలో చెల్లించవచ్చు. ఈ రకమైన లోన్ వడ్డీ రేట్లు మారవచ్చు అలాగే 2% నుంచి 22% వరకు ఉండవచ్చు. ప్రాసెసింగ్ ఫీ కూడా ఉండవచ్చు. మీరు నెలవారీ ఈఎంఐ పేమెంట్ మిస్ అయితే కనుక.. మీరు 100 నుంచి 500 రూపాయల వరకు లేట్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
అదీ కాకుండా, మీరు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి EMIలో ఫోన్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీరు 13% నుంచి 24% వరకు వడ్డీ రేటును చెల్లించాల్సి రావచ్చు. అదీకాకుండా, క్రెడిట్ కార్డ్ EMI కొనుగోళ్లతో యాడ్ అయినా 1% నుంచి 2.5% ప్రాసెసింగ్ ఫీజు ఉండవచ్చు.
ఇది రుణం ద్వారా ఖరీదైన ఫోన్‌ని కొనుగోలు చేయడం తెలివైన పనేనా అనే ప్రశ్న తలెత్తుతుంది. మీరు 2-3 సంవత్సరాల లోన్ తీసుకుంటుంటే, ఆ వ్యవధిలో మీరు ఫోన్ కోసం ఎంత అదనంగా చెల్లిస్తున్నారో పరిశీలించాలి. ఇంకా, మీరు 2-3 సంవత్సరాల తర్వాత మీ ఫోన్ రీసేల్ వాల్యూ కూడా పరిగణించాలి. సాధారణంగా మీరు ఫోన్ కొనుగోలు చేసిన రోజు నుంచి దాని విలువ తగ్గడం ప్రారంభమవుతుంది. ఉదాహరణకు, మీరు ఈరోజు 80,000 రూపాయలకు iPhone 14ని కొనుగోలు చేస్తే, దాని విలువ 6 నెలల్లో 40-50,000 రూపాయలకు పడిపోవచ్చు. గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఫోన్ జీవితకాలం సాధారణంగా 2-3 సంవత్సరాలు. కాబట్టి మీరు లోన్ తిరిగి చెల్లించే సమయానికి, ఫోన్ పాతది అయి ఉండవచ్చు. మీకు కొత్తది అవసరం కావచ్చు. కాబట్టి, ఫోన్‌ని కొనుగోలు చేయడానికి లోన్ తీసుకునే ముందు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి