Bank Locker Rules: బ్యాంక్ లాకర్‌లో డబ్బు దాస్తున్నారా? ఇది తెలిస్తే ఆ పని ఎప్పటికీ చేయరు
ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, బ్యాంకు లాకర్లు క్యాష్ ఉంచడానికి కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సవరించిన సేఫ్ డిపాజిట్ లాకర్ ఒప్పందం ప్రకారం.. లాకర్లలో క్యాష్ అనుమతించరు. నగలు - పత్రాలు వంటి విలువైన వస్తువులను ఉంచడం వంటి చెల్లుబాటు అయ్యే ప్రయోజనాల కోసం మాత్రమే లాకర్‌లను ఉపయోగించవచ్చు. నగదు లేదా కరెన్సీని ఉంచడం సాధ్యం కాదు..
బ్యాంకు లాకర్‌లో నగదు అంటే క్యాష్ ఉంచాలని ఆలోచిస్తున్నారా.. మళ్లీ ఆలోచించండి.. మళ్ళీ ఆలోచించండి.. ఏమిటి? ఇలా పదే పదే చెబుతున్నారు అనుకుంటున్నారా? కారణం ఉంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌లో ఒక మహిళ అలా చేసినందుకు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంది. ఒక మహిళ తన కూతురు పెళ్లి కోసం బ్యాంకు లాకర్‌లో 18 లక్షల రూపాయలను ఉంచింది. లాకర్‌కు చెదపురుగులు వచ్చి నగదు ధ్వంసమైంది. మరి ఇలా వచ్చిన నష్టాలకు బ్యాంకు బాధ్యత వహిస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మనం లాకర్‌లో ఏమి ఉంచవచ్చు? అనే విషయాన్ని తెలుసుకుందాం.
ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, బ్యాంకు లాకర్లు క్యాష్ ఉంచడానికి కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సవరించిన సేఫ్ డిపాజిట్ లాకర్ ఒప్పందం ప్రకారం.. లాకర్లలో క్యాష్ అనుమతించరు. నగలు – పత్రాలు వంటి విలువైన వస్తువులను ఉంచడం వంటి చెల్లుబాటు అయ్యే ప్రయోజనాల కోసం మాత్రమే లాకర్‌లను ఉపయోగించవచ్చు. నగదు లేదా కరెన్సీని ఉంచడం సాధ్యం కాదు.
అంతేకాదు.. ఒప్పందం ప్రకారం.. ఆయుధాలు, పేలుడు పదార్థాలు లేదా ఏదైనా నిషేధిత వస్తువులు.. పాడైన లేదా పాడైపోయే వస్తువులు.. రేడియోధార్మికత లేదా చట్టబద్ధంగా పరిమితం చేసిన ఏదైనా పదార్థం.. లేదా బ్యాంకుకు లేదా దాని కస్టమర్లకు ముప్పు కలిగించే ఏదైనా పదార్థం బ్యాంక్ లాకర్‌లో ఉంచలేరు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు 2021లో ‘సేఫ్ డిపాజిట్ లాకర్’పై ఒక సర్క్యులర్ జారీ చేసింది. భూకంపాలు, వరదలు మొదలైన ప్రకృతి వైపరీత్యాల వల్ల లాకర్‌లో ఉంచిన వస్తువులు పాడైపోతే.. లేదా కస్టమర్ పొరపాటు లేదా నిర్లక్ష్యం వల్ల కూడా బ్యాంకు బాధ్యత వహించదు. అయితే లాకర్ వ్యవస్థను విపత్తుల నుంచి కాపాడేందుకు బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. సేఫ్ డిపాజిట్ వాల్ట్‌లను ఉంచే ప్రాంగణం భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం అనేది బ్యాంకుల బాధ్యత.
ఆర్‌బీఐ ప్రకారం.. అగ్నిప్రమాదం, దొంగతనం, విధ్వంసం, భవనం కూలడం వంటి సంఘటనలు ఏవైనా లోపాలు లేదా నిర్లక్ష్యం కారణంగా సంభవించకుండా చూసుకోవడం బ్యాంకుల బాధ్యత. పైన పేర్కొన్న కారణాల వల్ల లాకర్‌లోని వస్తువులు నష్టపోతే. లేదా బ్యాంకు ఉద్యోగి నిజాయితీ లేని కారణంగా లాకర్ లోని వస్తువులకు ఏదైనా జరిగితే, బ్యాంకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు బ్యాంకు చెల్లించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు.. లాకర్ వార్షిక అద్దె 2,000 రూపాయలు అయితే.. బ్యాంకు మీకు 100 రెట్లు, అంటే 2 లక్షల రూపాయల వరకు మాత్రమే పరిహారం ఇస్తుంది. కానీ లాకర్ లో ఉంచిన మీ నగల విలువ 10 లక్షల రూపాయలు అయితే, అప్పుడు మీరు గణనీయమైన నష్టాన్ని చవిచూడవచ్చు.
బ్యాంక్ లాకర్ ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా తక్కువగా ఉంది.. కాబట్టి, మీరు లాకర్‌లో ఉంచిన విలువైన వస్తువులకు నగలతో సహా ఇన్సూరెన్స్ చేయడం చాలా అవసరం. సాధారణ ఇన్సూరెన్స్ కంపెనీలు గృహ ఇన్సూరెన్స్ లేదా కంటెంట్ ఇన్సూరెన్స్ ఉత్పత్తుల కింద బ్యాంక్ లాకర్ బీమాను అందిస్తాయి. ఉదాహరణకు, IFFCO టోకియో జనరల్ ఇన్సూరెన్స్ బ్యాంక్ లాకర్ పాలసీని అందిస్తుంది. ఈ పాలసీ 3 నుంచి 40 లక్షల రూపాయల వరకు కవరేజీని అందిస్తుంది. ఇటువంటి పాలసీలు సాధారణంగా నగలు ఇంటి పత్రాలు, షేర్ సర్టిఫికెట్లు – పాస్‌పోర్ట్‌లు వంటి విలువైన వస్తువులను కవర్ చేస్తాయి.
ఈ పాలసీలు దొంగతనం, విధ్వంసం, అగ్నిప్రమాదం అలాగే ఇతర సంఘటనల కారణంగా సంభవించే నష్టాన్ని కవర్ చేస్తాయి. MyWealth Growth సహ వ్యవస్థాపకుడు హర్షద్ చేతన్‌వాలా మాట్లాడుతూ.. ఏదైనా విలువైన వస్తువు, అది ప్రాణం లేదా ఆస్తి అయినా, ఇన్సూరెన్స్ చేయాలి. నష్టం జరిగితే మీకు ఆర్థికంగా నష్టం కలిగించే దేనికైనా ఇన్సూరెన్స్ చేయాలి.
బ్యాంక్ లాకర్ ఇన్సూరెన్స్ ప్రీమియం సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే దొంగతనం లేదా విధ్వంసం జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. లాకర్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇన్సూరెన్స్ చేసిన మొత్తంపై ఆధారపడి ఉంటుంది. మీకు బ్యాంక్ లాకర్ ఉంటే.. లోపల ఉంచిన వస్తువులకు ఇన్సూరెన్స్ చేయడం మర్చిపోవద్దు. లాకర్ ఒప్పందంలోని నిబంధనలను జాగ్రత్తగా చదవండి. మీరు ఎప్పుడూ విలువైన వస్తువులకు ఇన్సూరెన్స్ చేయాలి.
ఈ ఇన్సూరెన్స్ పాలసీలు బ్యాంక్ లాకర్ లోపల – వెలుపల ఉంచిన వస్తువులను కవర్ చేస్తాయి. మీరు లాకర్ నుంచి వస్తువులను బయటకు తీసిన తర్వాత కూడా వస్తువులకు ఇన్సూరెన్స్ ఉంటుంది. మీరు పెళ్లికి వెళ్ళడం కోసం మీ లాకర్ లోని నగలు తీసుకున్నారు అనుకోండి. పెళ్ళిలో ఆ నగలు దొంగతనానికి గురయ్యాయి అనుకోండి అప్పుడు మీరు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఆ నష్టానికి క్లెయిమ్ చేయవచ్చు. కానీ దాని కోసం, మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి