AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget-2025: బడ్జెట్‌కు ముందు హల్వా వేడుక ఎందుకు నిర్వహిస్తారు..?

Budget 2025 Halwa Ceremony: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ 2025-26 తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అందులో భాగంగా హల్వా వేడుకను నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో పార్లమెంట్ నార్త్ బ్లాక్ లో ఈ వేడుకను నిర్వహించారు..

Budget-2025: బడ్జెట్‌కు ముందు హల్వా వేడుక ఎందుకు నిర్వహిస్తారు..?
Subhash Goud
|

Updated on: Jan 24, 2025 | 8:04 PM

Share

Budget 2025 Halwa Ceremony: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ వార్షిక బడ్దెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే వివిధ వర్గాల వారితో సమావేశమై.. బడ్జెట్ కూర్పుపై చేసిన కసరత్తు ముగిసింది. ఇక బడ్జెట్ కాపీలు ముద్రణకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుకను నిర్మలా సీతారామన్ ఘనంగా నిర్వహించారు. కేంద్ర బడ్జెట్ కు సన్నాహకంగా చేసే సంప్రదాయ హల్వా వేడుకను ఢిల్లీలోని ఆర్థిక శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ హల్వా కలిపి ముద్రణా పనుల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ పంచారు.

హ‌ల్వా వేడుక‌లు:

ఇదిలా ఉంటే ఏటా బడ్జెట్‌కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహిస్తారు. దీని వెనుక ఉన్న కారణం చూస్తే ఏటా బడ్జెట్ ప్రతులకు సంబంధించిన ముద్రణ వ్యవహరాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అత్యంత గోప్యంగా ఉంచుతుంది. బడ్జెట్ ప్రతుల ముద్రణలో పాల్గొనే సిబ్బంది మొత్తం, ముద్రణ పూర్తి అయి, పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకూ వారంతా ఆర్థిక శాఖ కార్యాలయంలోని నార్త్ బ్లాక్ లోనే ఉంటారు. ఆ సమయంలో వారు ఇంటికి కూడా వెళ్లారు. వారు బయటి ప్రపంచంతో సంప్రదించేందుకు ఫోన్ కూడా అందుబాటులో ఉండదు.

అయితే ముద్రణ పనిలో ఆర్థిక శాఖ సిబ్బంది నిమగ్నం కావడానికి ముందు వారికి తీపి తినిపించాలనే ఉద్దేశంతో హల్వా చేయడం ఆచారంగా వస్తోంది. హల్వాను భారతీయ ప్రత్యేక వంటకంగా పరిగణిస్తారు. అందుకే హల్వా తయారీతో బడ్జెట్ ప్రతుల ముద్రణ ప్రారంభిస్తారు. ఈ బడ్జెట్ పత్రాల ముద్రణ చాలా పకడ్బందీగా కొనసాగుతుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘా నీడలో ఆర్థిక మంత్రిత్వ శాఖ బేస్‌మెంట్‌లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌ లో వీటిని ముద్రిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే