Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheque: చెక్కుపై నల్ల ఇంక్‌తో సంతకం చేయకూడదా? ఆర్బీఐ మార్గదర్శకాలు ఏంటి?

Cheque: చాలా మంది డబ్బుల విషయంలో ఇతరులకు చెక్‌ను ఇస్తుంటారు. చెక్‌పై సంతకం చేసేటప్పుడు రిజర్వ్‌ బ్యాంక్‌ నియమ నిబంధనలు రూపొందించింది. అయితే సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అవుతోంది. చెక్‌పై బ్లాక్‌ ఇంక్‌ పెన్‌తో సంతకం చేస్తే చెల్లదని, అలా చేయకూడదని వైరల్‌ అవుతోంది..

Cheque: చెక్కుపై నల్ల ఇంక్‌తో సంతకం చేయకూడదా? ఆర్బీఐ మార్గదర్శకాలు ఏంటి?
Follow us
Subhash Goud

|

Updated on: Jan 24, 2025 | 7:38 PM

సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. అందులో కొన్ని నిజాలు ఉంటాయి.. మరి కొన్ని అబద్దాలు కూడా ఉంటాయి. వీటితో పాటు తప్పుడు సమాచారం కూడా సృష్టించి ప్రచారం చేస్తున్నారు. అయితే చెక్కుపై నల్ల సిరాతో సంతకం చేయకూడదు, అలా చేస్తే చెక్ చెల్లదని, ఇదీ ఆర్‌బీఐ మార్గదర్శకాలు అంటూ ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ వైరల్ పోస్ట్‌పై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో X ఖాతా స్పందిస్తూ అది తప్పుడు సమాచారమని స్పష్టం చేసింది.

నల్ల ఇంకుతో చెక్కులు రాయకూడదని ఆర్బీఐ ఆదేశించిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు హల్ చల్ చేస్తున్నాయి. ఇది పూర్తిగా తప్పుడు సమాచారం. “చెక్‌పై రాయడానికి అటువంటి రంగు ఇంక్ ఉపయోగించాలని RBI ఎటువంటి మార్గదర్శకాలను జారీ చేయలేదు” అని PIB ఫాక్ట్ చెక్ తన ఎక్స్-పోస్ట్‌లో పేర్కొంది.

చెక్కులపై రాయడంపై RBI మార్గదర్శకాలు ఏమిటి?

ఆర్బీఐ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTC) ప్రకారం, చెక్‌పై రాసేటప్పుడు స్పష్టంగా, శాశ్వతమైన ఇంక్‌ని ఉపయోగించాలి. ఇది రాసిన దానిని మార్చదు. ఇది ఆర్‌బీఐ మార్గదర్శకాల్లో పేర్కొన్న నిబంధన. అయితే చెక్కులో నిర్దిష్టమైన ఇంకు రంగులు రాయాలని ఎక్కడా పేర్కొనలేదు.

మరో వాస్తవం ఏమిటంటే, చెల్లింపుదారుడి పేరు, వారికి ఇవ్వాల్సిన డబ్బు చెక్కుపై సంఖ్యలు, అక్షరాలతో రాయాలి. ఒకసారి రాసిన తర్వాత మార్చలేము. అటువంటి టాంపర్డ్ లెటర్, నంబర్‌తో కూడిన చెక్కు బ్యాంకుచే తిరస్కరించబడుతుంది. మీరు చెక్కు జారీ చేసేటప్పుడు ఏదైనా తప్పుగా గుర్తించినట్లయితే, దాన్ని సరిదిద్దడానికి బదులుగా, కొత్త చెక్కును జారీ చేయండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి