Uber, Ola: ఓలా, ఉబర్‌లకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు.. ఎందుకో తెలుసా..?
Uber, Ola: లోకల్‌లో ఎక్కడికైనా వెళ్లాలంటే ఓలా, ఉబర్‌లను ఆశ్రయిస్తుంటాము. అయితే ఈ వాహనాలను బుక్ చేసుకున్న నిమిషాల్లోనే మన ఇంటి వద్దకే వచ్చేస్తుంటాయి. అయితే ఛార్జీలు మాత్రం వెళ్లే దూరం బట్టి ఉంటాయి. అంతేకాదు రాత్రి అయితే ఛార్జీలతో తేడా ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఓలా, ఉబర్‌లకు కేంద్రం నోటీసులు జారీ చేసింది..

ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారుల మధ్య ఒకే చోట ఛార్జీల వ్యత్యాసాల నివేదికల నేపథ్యంలో ట్రావెల్ యాప్ కంపెనీలైన ఉబర్, ఓలాలకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో ఒకే స్థలంలో ఓలా, ఉబర్ వేర్వేరు ధరలను చూపుతున్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. ఈ ఆరోపణలపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ విచారణ జరుపుతోంది. ఉబెర్, ఓలా ఉద్దేశపూర్వక ఆరోపణలను ఖండించాయి.
ప్రయాణాన్ని బుక్ చేసుకోవడానికి ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ రకం ఆధారంగా వేర్వేరు ధరల నివేదికలపై కేంద్ర ప్రభుత్వం వివరణ కోరిన తర్వాత వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్యాబ్ కంపెనీలు ఓలా, ఉబర్‌లకు నోటీసులు జారీ చేసింది.
The Curious Case of Uber Fare Discrepancies: Platform and Battery Impact
Ride-hailing platforms like Uber have revolutionized transportation, but recent observations raise questions about the transparency of their pricing algorithms. In this post, I’ll dive into two surprising… pic.twitter.com/nlQCM0Z49B
— Rishabh Singh (@merishabh_singh) January 18, 2025
చాలా మంది వినియోగదారులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓలా, ఉబర్ కంపెనీల నుంచి వివరణ కోరింది. ఈ యాప్‌ల వినియోగదారులు ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్‌లో బుకింగ్ చేస్తున్నారా అనే దానిపై ఆధారపడి ఒకే సేవకు ఓలా, ఉబర్ వేర్వేరు రేట్లను వసూలు చేస్తున్నాయని నివేదికల నేపథ్యంలో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) ఈ చర్య తీసుకుంది.
Different fares for same trip at same time on android and iphone. @Uber_India can you please explain the bias? @inshorts @UberFacts @UberSoc @Uber @Uber_Support @UberIN_Support pic.twitter.com/xbz0dWVslQ
— Vinay Kumar (@vkvinay) December 24, 2024
వినియోగదారులు ఉపయోగించే ఫోన్ రకం ఆధారంగా ధర నిర్ణయించబడుతుందనే విషయాన్ని ఉబర్ ఖండించింది. పిక్-అప్ పాయింట్లు, అంచనా వేసిన సమయం (ETA), డ్రాప్-ఆఫ్ పాయింట్ల కారణంగా ఛార్జీల వ్యత్యాసాలు సంభవించవచ్చని కంపెనీ తెలిపింది.
@Uber_Support @Uber_India I booked an XL cab for which on my iphone I was shown Rs 494. In 5 minutes my dad checked the fare on his android and it was Rs 374
Therefore I cancelled it on my phone and you are charging Rs 79! That too for not even having connected a driver yet! pic.twitter.com/oQwgipYW11
— Utsav Bansal (@realUtsavBansal) January 18, 2025
ఒకే స్థలం నుంచి క్యాబ్ బుక్ చేసుకుంటే ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో వేర్వేరు ధరలు కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో కస్టమర్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఓలా, ఉబర్, రాపిడో వంటి ప్లాట్‌ఫారమ్‌లపై దర్యాప్తు జరపాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సీసీపీఏని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Budget-2025: బడ్జెట్‌కు ముందు హల్వా వేడుక ఎందుకు నిర్వహిస్తారు..?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి