Budget 2023: ఇక బంగారంపై వాయింపుడే.. భారీగా పెరగనున్న పసిడి ధరలు.. బడ్జెట్‌లో నిర్మలమ్మ సంచలన ప్రకటన
పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 2023-24 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌లో కేంద్రం సంచనల నిర్ణయం..
పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 2023-24 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌లో కేంద్రం సంచనల నిర్ణయం తీసుకుంది. పలు వస్తువుల ధరలు పెంచుతూ, పలు వస్తువుల ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఇక బంగారం ప్రియులకు షాకింగ్ ప్రకటన చేశారు మంత్రి నిర్మలాసీతారామన్.
ఇక బంగారం, వెండి ధరలపై కస్టమ డ్యూటీ పెంచుతున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. రత్నాలు, ఆభరణాల రంగానికి సంబంధించి బంగారం, మరికొన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సూచించింది. ఇది దేశం నుండి ఆభరణాలు, ఇతర తుది ఉత్పత్తుల ఎగుమతులను పెంచడంలో సహాయపడుతుంది. గతేడాది బడ్జెట్‌లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం పెంచింది.