Budget 2023: పేదలకు ఇల్లు నగరం చివర నిర్మిస్తే బతికేదెట్టా? బడ్జెట్‌పై సామాన్యుడి అభిప్రాయం
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2024 ఎన్నికల కంటే ముందు ఇదే చివరి బడ్జెట్. బడ్జెట్‌పై కోటి ఆశలు ఉన్నాయి. మంత్రి నిర్మలమ్మ..
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2024 ఎన్నికల కంటే ముందు ఇదే చివరి బడ్జెట్. బడ్జెట్‌పై కోటి ఆశలు ఉన్నాయి. మంత్రి నిర్మలమ్మ ఏ వర్గానికి దయ చూపుతుందోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ సందర్భంగా ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపులుదారులు, నిరుద్యోగులు, మహిళలు ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చివరి బడ్జెట్‌లోనైనా ఏమైనా మేలు జరుగుతుందా? అని ఆశగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికి వారు తమ అభ్యర్థనను తెలియజేస్తున్నారు. చివరకు ఇళ్లల్లో ఉండే పని మనుషులు కూడా తమ తమ గోడును మంత్రి నిర్మలమ్మ ముందు వెళ్లబోసుకుంటున్నారు. మరి వారి గోడు ఏంటో వారి మాటల్లోనే విందాం..
నిర్మలా మేడమ్ నమస్కారం..
నా పేరు లచ్చి.. నేను ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తాను. నా విన్నపాన్ని ఎలా రాయాలో తెలియదు. అందుకే ఈ లేఖ రాయడానికి మా ఇంటి దగ్గర ఉండే అక్క సహాయం తీసుకున్నాను. నా బాధలన్నీ ఆమెతో పంచుకుంటున్నాను. ఆ అక్క స్కూల్ టీచర్. ఆమె రోజూ వార్తలన్నీ చూస్తూ ఉంటుంది. దేశాన్ని ప్రభుత్వం నడిపిస్తుందని అక్క చెప్పారు. అలాగే మీరు బడ్జెట్‌లో సలహాలను అడిగారట. అందుకే చాలా ఆశతో ఈ లేఖ రాశాను. అమ్మా, మనం సంపాదిస్తున్నది చాలా తక్కువ. మేము మా జీతాలను కూడా నిర్ణయించలేము. ఎందుకంటే మా పనిమనిషుల కోసం చట్టం లేదు. ప్రతి ఒక్కరూ వారి ఇష్ట ప్రకారం మాకు చెల్లిస్తారు. ఎక్కువ డిమాండ్ చేసినా ఇవ్వరు. మాపై ఎవ్వరు కూడా కనికరం చూపరు. వారు ఎంతిస్తే అంతే తీసుకోవాలి. నెలకు 30 రోజులు పని చేయాల్సి ఉంటుంది. మాకు ఏ రోజు సెలవు అంటూ ఉండదు. మాకు అనారోగ్యం వచ్చినా, సెలవు తీసుకున్నా కొంత మంది జీతం కూడా కట్ చేస్తారు. దీదీ నాకు ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు మా మురికివాడ దగ్గరలోని స్థానిక పాఠశాలలో చదువుతున్నారు.
లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్‌లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. నా దగ్గర స్మార్ట్‌ఫోన్ లేదు. ఇంటర్నెట్ లేకపోవడంతో వారి చదువు ఆగిపోయింది. మురికివాడలోని ఆ పాఠశాల కూడా మూతపడింది. ఇక నాకు పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపించేంత స్థోమత లేదు. ఎందుకంటు ఫీజులు భరించలేనంతగా ఉంటాయి కాబట్టి. నేను రాత్రి 10 గంటల వరకు సొసైటీలో పని చేస్తాను. తద్వారా కనీసం నా పిల్లల్లో ఒకరి స్కూల్ ఫీజును భరించగలను. సమీపంలో ప్రభుత్వ పాఠశాలలు లేవు.
మేము మురికివాడలలో నివసిస్తున్నాము. కనీసం కరెంటు సదుపాయం కూడా ఉండదు. చివరకు అధికారులకు లంచం ఇచ్చి కరెంటు పొందుతున్నాం. కానీ ప్రతి 6 నెలల నుంచి ఒక సంవత్సరానికి ఒకసారి మురికివాడలను మార్చాలి. పేదలకు కేంద్ర ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తుందని చెప్పారు. నాలాంటి వారు. పొరుగువారు దాని కోసం నమోదు చేసుకున్నారు. నేను దాని కోసం చెల్లింపు కూడా చేశాను. కానీ ఇప్పటి వరకు ఏమి లభించలేదు. నా పొదుపు మొత్తాన్ని కూడా ఆ ఇంటి కోసం వాడులుకున్నాను. అయితే పేదల కోసం ఇళ్లు నిర్మించారు కానీ.. నగరానికి దూరంగా ఉన్నాయి. మా జీవన విధానం గగనంగా మారింది అక్కా. పేదలకు ఇళ్లు కట్టించే సమయంలో ప్రభుత్వం ఈ విషయాలన్నీ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు?
పేదలకు రేషన్ కూడా ఉచితం అని చెప్పారు. కానీ మాకు రేషన్ కార్డు కూడా లేదు. రేషన్ కార్డు కోసం ఓ కాంట్రాక్టర్‌కు లంచం కూడా ఇచ్చాం. ఇప్పటికీ మాకు ఏమీ రాలేదు. నా భర్త మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరం సంపాదిస్తున్నాం కాబట్టి సిటీలో బతకగలుగుతున్నాం. మేడమ్ మీరు పేద ప్రజల కోసం చాలా పథకాలు చేశారని నేను తెలుసుకున్నాను. కానీ సమస్య ఏమిటంటే పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి మీదగ్గర సరైన సమాచారం ఉన్నట్టు లేదు.
ప్రతిదానికీ డబ్బులు చెల్లిస్తున్నాము. కానీ ఎలాంటి సాయం అందడం లేదు. మాకు ప్రభుత్వ సాయం అందింది లేదు. మీరు మార్పు తీసుకురాగలరని టీచర్ అక్క నాకు చెప్పారు. ఈసారి మాకు సహాయపడే పని చేయండి మేడమ్.
మీ లచ్చి
మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి