AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL 5G Phone: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 5G స్మార్ట్‌ఫోన్‌.. 200MP కెమెరా! అవునా.. నిజమా..?

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియాతో సహా భారతదేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలు జూలై 2024లో తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. టారీఫ్‌ ధరలు పెంచడంతో చాలా మంది కస్టమర్ల బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మళ్లుతున్నారు. ఇతర టెలికాం కంపెనీలు ధరలు పెంచినా బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం..

BSNL 5G Phone: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 5G స్మార్ట్‌ఫోన్‌.. 200MP కెమెరా! అవునా.. నిజమా..?
Bsnl 5g
Subhash Goud
|

Updated on: Aug 14, 2024 | 11:07 AM

Share

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియాతో సహా భారతదేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలు జూలై 2024లో తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. టారీఫ్‌ ధరలు పెంచడంతో చాలా మంది కస్టమర్ల బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మళ్లుతున్నారు. ఇతర టెలికాం కంపెనీలు ధరలు పెంచినా బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం ఎలాంటి రీఛార్జ్‌ ధరలను పెంచలేదు. ఇప్పటికే చాలా మంది కస్టమర్ల బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు వెళ్లిపోయారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా బీఎస్ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. లక్ష టవర్లను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి.

దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో ఈరోజుల్లో సోషల్ మీడియాలో బీఎస్‌ఎన్‌ఎల్ గురించి కొన్ని విషయాలు పుకార్లు షికార్లు అవుతున్నాయి. దీంతో జనాలు గందరగోళానికి గురవుతున్నారు. దేనిగురించి అయినా పుకార్లు వ్యాపించాలంటే అది సోషల్ మీడియానే అని చెప్పక తప్పదు. బీఎస్‌ఎన్‌ఎల్ తన 5G ఫోన్‌ను త్వరలో విడుదల చేయబోతోందని, అది కూడా 200 మెగాపిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ఫాస్ట్ 5G కనెక్టివిటీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇలా 5జీ స్మార్ట్‌ఫోన్‌ తీసుకువస్తున్న వార్తలపై బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పందించింది. ప్రభుత్వ టెలికాం సంస్థ తన అధికారిక X హ్యాండిల్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Mukesh Ambani: ఐదేళ్ల నుంచి జీతం తీసుకోకుండానే పని చేస్తున్న అంబానీ.. మరి ఖర్చులు ఎలా?

ఇలాంటి విషయాలను నమ్మవద్దని, అంతా పచ్చి అబద్దమని తేల్చి చెప్పింది. బిఎస్‌ఎన్‌ఎల్ ఫేక్ న్యూస్ ట్రాప్‌లో పడవద్దని, బిఎస్‌ఎన్‌ఎల్ వెబ్‌సైట్ నుండి నిజమైన వార్తలను తెలుసుకోవాలని సూచించింది. తాము ఎటువంటి స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడం లేదని స్పష్టం చేసింది. సో.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం అంతా అబద్దమని స్పష్టమైంది. ఇదిలా ఉండగా, దేశంలో 4జీ నెట్‌వర్క్‌ ఆగస్టు 15 నుంచి పూర్తి స్థాయిలో అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అంతేకాదు 5జీ నెట్‌వర్క్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. స్వదేశీ టెక్నాలజీతో 4జీ, 5జీని అందుబాటులోకి తీసుకురానుంది.

ఇది కూడా చదవండి: Mukesh Ambani Security: ముఖేష్ అంబానీ సెక్యూరిటీ గార్డు జీతం ఎంత ఉంటుందో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి