BSNL అద్భుతమైన ప్లాన్.. రూ.147కే 30 రోజుల వ్యాలిడిటీ.. అన్ని బెనిఫిట్స్!
BSNL Plan: మీరు తక్కువ బడ్జెట్‌లో మంచి రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్లాన్ మీకు మంచి ఎంపిక కావచ్చు. ఈ ప్లాన్‌లో 30 రోజుల చెల్లుబాటుతో పాటు వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ సేవను పొందుతారు. ఇక డేటా విషయానికొస్తే..

BSNL Plan: టెలికాం రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు మంచి రోజులు వచ్చాయి. ఇటీవల ప్రైవేట్ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీ రీఛార్జ్ ధరలు పెంచిన తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌కు మంచి రోజులు కలిసి వచ్చాయి. ఈ కంపెనీలు ప్లాన్ ధరలు పెంచినా బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ఒక్క రూపాయలు కూడా పెంచలేదు. దీంతో చాలా మంది వినియోగదారులను బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది కొత్త వినియోగదారులు బీఎస్ఎన్‌ఎల్‌లో చేరారు. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ చౌకైన ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. ఈ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం అత్యంత చౌకైన ప్లాన్‌ను ప్రారంభించింది. మీరు తక్కువ బడ్జెట్‌లో నెల మొత్తం మాట్లాడటానికి, SMS పంపడానికి ఒక ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్లాన్ BSNL వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: Dussehra-2025: దసరా పండగ ఎప్పుడు? అక్టోబర్ 1న లేదా 2వ తేదీనా..?
బీఎస్‌ఎన్‌ఎల్ చౌకైన ప్లాన్ రూ.147 నుండి ప్రారంభమవుతుంది. ఈ రూ.147 ప్లాన్ 30 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఈ ప్లాన్ ధరను ఒక రోజు కోసం పరిశీలిస్తే, అది కేవలం రూ.5కి వస్తుంది.
మీరు తక్కువ బడ్జెట్‌లో మంచి రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్లాన్ మీకు మంచి ఎంపిక కావచ్చు. ఈ ప్లాన్‌లో 30 రోజుల చెల్లుబాటుతో పాటు వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ సేవను పొందుతారు. ఇక డేటా విషయానికొస్తే 10GB వరకు అందిస్తుంది. 10GB డేటా అయిపోయినప్పుడు ఇంటర్నెట్ వేగం 40 Kbpsకి తగ్గుతుంది. ఎక్కువ కాల్స్ చేసుకోవాల్సిన, తక్కువ డేటా అవసరమయ్యే వినియోగదారులకు ఈ ప్లాన్ మంచిది.
ఇది కూడా చదవండి: Expensive Fruits: ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండు ఏది? దీని ధర రూ.24 లక్షలు!
Indian Railways: రైల్వే కీలక నిర్ణయం.. టికెట్ ఉంటేనే స్టేషన్‌లోకి అనుమతి.. ఈ స్టేషన్ నుంచి ట్రయల్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




