కేంద్రం కీలక నిర్ణయం.. బ్యాంకుల దారిలోనే ఇక బీఎస్ఎన్ఎల్ కూడా..!

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రప్రభుత్వం తన దూకుడును మరింత పెంచింది. ఇప్పటికే బ్యాంకులను విలీనం చేస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇదే ఫార్ములాను ఇక ప్రభుత్వ టెలికాం సంస్థలపై కూడా ప్రయోగించేందుకు నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలపై కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌ సంస్థలను విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ రెండింటిని.. మూసేయడం కానీ, వదిలించుకోవడం కానీ చేయబోమని మంత్రివర్గం స్పష్టం చేసింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పూర్తిగా […]

కేంద్రం కీలక నిర్ణయం.. బ్యాంకుల దారిలోనే ఇక బీఎస్ఎన్ఎల్ కూడా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Oct 24, 2019 | 8:38 AM

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రప్రభుత్వం తన దూకుడును మరింత పెంచింది. ఇప్పటికే బ్యాంకులను విలీనం చేస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇదే ఫార్ములాను ఇక ప్రభుత్వ టెలికాం సంస్థలపై కూడా ప్రయోగించేందుకు నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలపై కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌ సంస్థలను విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ రెండింటిని.. మూసేయడం కానీ, వదిలించుకోవడం కానీ చేయబోమని మంత్రివర్గం స్పష్టం చేసింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పూర్తిగా విలీనమయ్యే వరకు బీఎస్ఎన్ఎల్ యూనిట్‌గా ఎంటీఎన్ఎల్ పని చేయనున్నట్లు పేర్కొంది.

కేంద్ర సమాచార శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహానగర్ టెలిపోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్)లను విలీనం చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు. వీటిని మూసేయడం కానీ, వదిలించుకోవడం కానీ జరగదని.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెలికాం సంస్థలను లాభాల బాట పట్టించేందుకే.. ఈ రెండు సంస్థలను విలీనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు కంపెనీలు మరింత పోటీ తత్వంతో పని చేసేవిధంగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.