ఈ యాప్‌తో ఫ్రీగా మెట్రోలో ప్రయాణించండి.. ఎలాగంటే?

ప్రముఖ క్యాబ్ బుకింగ్ సంస్థ ఉబెర్ భారత్‌లో మరో కొత్త సర్వీసుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ప్రైవేట్ క్యాబ్ సర్వీసులు మాత్రమే ఉన్న ఈ యాప్‌లో త్వరలోనే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ కూడా అందుబాటులోకి రానుంది. అందుకు అనుగుణంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌తో ఉబర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలే ఈ ఫీచర్‌ను ఢిల్లీ మెట్రో అధికారులతో కలిసి లాంచ్ చేసిన ఉబర్.. త్వరలోనే యూజర్లకు ఇది అందుబాటులోకి రానుందని తెలిపింది. దీని ద్వారా ఉబర్ క్యాబ్‌‌లో ప్రయాణించేవారికి.. […]

ఈ యాప్‌తో ఫ్రీగా మెట్రోలో ప్రయాణించండి.. ఎలాగంటే?
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 24, 2019 | 10:24 AM

ప్రముఖ క్యాబ్ బుకింగ్ సంస్థ ఉబెర్ భారత్‌లో మరో కొత్త సర్వీసుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ప్రైవేట్ క్యాబ్ సర్వీసులు మాత్రమే ఉన్న ఈ యాప్‌లో త్వరలోనే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ కూడా అందుబాటులోకి రానుంది. అందుకు అనుగుణంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌తో ఉబర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలే ఈ ఫీచర్‌ను ఢిల్లీ మెట్రో అధికారులతో కలిసి లాంచ్ చేసిన ఉబర్.. త్వరలోనే యూజర్లకు ఇది అందుబాటులోకి రానుందని తెలిపింది.

దీని ద్వారా ఉబర్ క్యాబ్‌‌లో ప్రయాణించేవారికి.. ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇంటి నుంచి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లే ప్రయాణికులు.. ఇకపై అదే యాప్‌తో మెట్రో రైళ్లలో కూడా ప్రయాణించవచ్చు. దీనికి ప్రత్యేకంగా టోకెన్, స్మార్ట్ కార్డు అవసరం లేదు. జస్ట్ మెట్రో స్కానర్ దగ్గర క్యూర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు… నేరుగా ప్లాట్‌ఫాంపైకి వెళ్లి రైలు ఎక్కవచ్చు. ఇక జర్నీ ముగిసిన తర్వాత ఎగ్జిట్ గేట్ దగ్గర కూడా మళ్ళీ క్యూర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. అక్కడ నుంచి కావాలంటే క్యాబ్ బుక్ చేసుకుని నేరుగా ఇల్లు లేదా ఆఫీస్‌కి వెళ్లిపోవచ్చు. కాగా, ఈ జర్నీకి అయిన మొత్తం డబ్బును మనం గమ్యస్థలం దగ్గర చెల్లించవచ్చు.