‘హుజూర్‌నగర్’ బైపోల్‌లో కనిపించని ‘ఆర్టీసీ సమ్మె’ ఎఫెక్ట్..!

అందరూ ఊహించిన విధంగా ఆర్టీసీ సమ్మె ప్రభావం హుజుర్ నగర్ ఉప ఎన్నికపై పడవచ్చన్న అంచనాలు తారుమారయ్యాయి. ఉప ఎన్నికల ఫలితాల్లో గెలుపు ఏకపక్షంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉన్నా.. కారు జోరు మాత్రం ప్రతి రౌండ్‌కి పెరుగుతూ భారీ మెజార్టీని దక్కించుకునే దిశగా సాగుతోంది. ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ ఫలితాలపై ఖచ్చితంగా ఉంటుందని.. అధికార పక్షానికి భారీ ఓటమి తప్పదని మొదట అంచనాలు వ్యక్తం అయ్యాయి. కానీ అది కాస్తా రివర్స్ అయింది. టీఆర్ఎస్ […]

'హుజూర్‌నగర్' బైపోల్‌లో కనిపించని 'ఆర్టీసీ సమ్మె' ఎఫెక్ట్..!
Follow us

|

Updated on: Oct 24, 2019 | 1:24 PM

అందరూ ఊహించిన విధంగా ఆర్టీసీ సమ్మె ప్రభావం హుజుర్ నగర్ ఉప ఎన్నికపై పడవచ్చన్న అంచనాలు తారుమారయ్యాయి. ఉప ఎన్నికల ఫలితాల్లో గెలుపు ఏకపక్షంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉన్నా.. కారు జోరు మాత్రం ప్రతి రౌండ్‌కి పెరుగుతూ భారీ మెజార్టీని దక్కించుకునే దిశగా సాగుతోంది. ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ ఫలితాలపై ఖచ్చితంగా ఉంటుందని.. అధికార పక్షానికి భారీ ఓటమి తప్పదని మొదట అంచనాలు వ్యక్తం అయ్యాయి. కానీ అది కాస్తా రివర్స్ అయింది. టీఆర్ఎస్ పార్టీ మరోసారి తన హవా చూపించింది.

కాంగ్రెస్‌కు కంచుకోటలా ఉన్న హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితాలపై మరోసారి కేసీఆర్ వ్యూహాత్మక విధాన ప్రభావం నూటికి నూరు శాతం కనిపించింది. ప్రజలు మరోసారి టీఆర్ఎస్ పార్టీకి జై కొట్టారని చెప్పొచ్చు. ప్రతి రౌండ్‌లోనూ ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. దీనితో ప్రజలందరూ ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం పక్షాన నిలిచారా.. లేక గులాబీ బాస్‌ మీదనే మరోసారి నమ్మకం ఉంచి ఓటేశారా? అనే దానిపై ఇప్పుడు రాజకీయంగా చర్చ సాగుతోంది. ఏది ఏమైనా ఇప్పుడున్న దేశ రాజకీయాల దృష్ట్యా చూస్తే.. ఒక విధంగా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న కేసీఆర్‌కు ఇది పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు కేసీఆర్ ఆర్టీసీ సమ్మె విషయంలో ఎలాంటి అడుగులు వేస్తారో వేచి చూడాలి.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..