Business Idea: అతి తక్కువ పెట్టుబడి.. ప్రతి రోజూ ఆదాయం! ట్రెండీ బిజినెస్.. ఇంటిపై కూడా పెట్టుకోవచ్చు!
బాక్స్ క్రికెట్ ప్రస్తుతం ఒక ట్రెండీ, లాభసాటి వ్యాపార ఆలోచన. నగరాల్లో గ్రౌండ్ల కొరత, ఒత్తిడి తగ్గించుకోవడానికి ఆటల ఆవశ్యకత పెరగడంతో, తక్కువ స్థలంలోనే నెట్స్ ఏర్పాటు చేసి, యువత, ఉద్యోగుల కోసం బాక్స్ క్రికెట్ సేవలను అందించవచ్చు. ఒకసారి పెట్టుబడి పెడితే, గంటల ఆధారంగా ఆదాయం పొందవచ్చు.

సాధారణంగా బిజినెస్ చేయాలంటే వస్తువులను అమ్మడం, తయారు చేయడం వాటిని అమ్మడం మాత్రమే కాదు. కొన్ని ట్రెండీ బిజినెస్‌లు ఉంటాయి. చాలా మంది అందులో ఏం డబ్బు వస్తుంది అనుకుంటారు. కానీ అందులోనే కనిపించని డబ్బు ఉంటుంది. సరిగ్గా ప్లాన్ చేసి, సెట్ చేసి వదిలేస్తే చాలు.. వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో ప్రతి రోజు ఆదాయం పొందవచ్చు. అలాంటి ఓ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ మధ్యకాలంలో వైద్యులు ఉద్యోగులను తమ ఒత్తిడి జీవితంలో నుంచి బయటకు వచ్చేందుకు ఆటలు ఆడమని సలహా ఇస్తున్నారు. అలాగే కార్పోరేట్ ఉద్యోగులు కూడా సాయంత్రం వేళల్లో సరదాగా ఏదో ఒక అవుట్ డోర్, ఇండోర్ గేమ్ ఆడుతున్నారు. మన దేశంలో చాలా మందికి ఇష్టమైన ఆట క్రికెట్. అలాగే చాలా మందికి వచ్చిన ఆట కూడా క్రికెట్టే. అయితే ప్రస్తుతం నగరాల్లో క్రికెట్ ఆడటానికి గ్రౌండ్స్ పెద్దగా లేవు. రోడ్లమీద ఆడినట్లయితే పెద్ద న్యూసెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. వయసులో పెద్దవాళ్లు అయిపోయాక రోడ్డు మీద క్రికెట్ ఆడటం అనేది నామోషీగా కూడా ఉంటుంది. దీని దృష్టిలో ఉంచుకొని ఒక బిజినెస్ ఐడియా ద్వారా దీన్ని ఒక వ్యాపార అవకాశం గా మార్చుకోవచ్చు.
బాక్స్ క్రికెట్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. చుట్టూ నెట్స్ కట్టి లోపల ఎంచక్కా క్రికెట్ ఆడుకోవచ్చు. ఈ బాక్స్ క్రికెట్ కాన్సెప్ట్ ఏమిటంటే నలువైపులతోపాటు పైన కూడా నెట్ కడతారు. దీనివల్ల బంతి ఎంత బలంగా బారిన ఆ బాక్స్ లోపల ఉంటుంది బయటకు వెళ్ళదు. తక్కువ స్థలంలోనే మీరు ఎంచక్కా క్రికెట్ ఆడుకోవచ్చు. మీకు నచ్చినట్లుగా క్రికెట్ షాట్స్ కొట్టవచ్చు. బంతిని ఎంత బలంగా బాదినా నెట్స్ కు తగిలి మళ్ళీ లోపల పడిపోతుంది. అందుకే ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా ఈ బాక్స్ క్రికెట్ ఆడేందుకు ఇష్టపడుతున్నారు. దీన్ని మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకొని డబ్బు సంపాదించుకోవచ్చు. బాక్స్ క్రికెట్ ఒక ఖాళీ స్థలాన్ని ఎంపిక చేసుకొని అందులో నెట్స్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది.
ఖాళీ స్థలాలు దొరకని వారు బిల్డింగ్ పైన టెర్రస్ ఏరియాలో ఈ బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల చక్కగా డబ్బు సంపాదించుకోవచ్చు. గంటల చొప్పున ఈ బాక్స్ క్రికెట్ లో ఆటగాళ్ల నుంచి డబ్బు వసూలు చేయవచ్చు. ఒక గంటకు రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు చార్జర్ చేయవచ్చు. బౌలింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేసి కోచింగ్ సైతం ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
