Bounce Infinity: బ్యాటరీ కొత్త టెక్నాలజీ అదిరింది.. సూపర్ ఫాస్ట్ చార్జింగ్.. సింగిల్ చార్జ్‌పై120కి.మీ..
ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ స్టార్టప్ క్లీన్ ఎలక్ట్రిక్ భాగస్వామ్యంతో నడిచే స్వదేశీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీదారు బౌన్స్ ఇన్ఫినిటీ ఓ కొత్త మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసింది. ఈ స్కూటర్లో పోర్టబుల్ లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ టెక్నాలజీని తీసుకొచ్చింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1. ఈ క్రమంలో పోర్టబుల్ లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ టెక్నాలజీ అంటే.. దాని వల్ల ప్రయోజనాలు ఏంటి?

ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలకు మన దేశంలో మంచి డిమాండ్ ఉంది. వినియోగదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. కంపెనీల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రతి కంపెనీ తమ ఉత్పత్తుల్లో ప్రత్యేకతను చూపించేందుకు తాపత్రయపడుతున్నాయి. ఏదో ఒక కొత్త ఫీచర్ లేదా సాంకేతికతతో తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ స్టార్టప్ క్లీన్ ఎలక్ట్రిక్ భాగస్వామ్యంతో నడిచే స్వదేశీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీదారు బౌన్స్ ఇన్ఫినిటీ ఓ కొత్త మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసింది. ఈ స్కూటర్లో పోర్టబుల్ లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ టెక్నాలజీని తీసుకొచ్చింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1. ఈ క్రమంలో పోర్టబుల్ లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ టెక్నాలజీ అంటే.. దాని వల్ల ప్రయోజనాలు ఏంటి? బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1లో ఉన్న ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1..
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో అత్యాధునిక సాంకేతికత ఉందని కంపెనీ పేర్కొంది. అలాగే దాని రేంజ్ మరింత పెరుగుతుందని వివరించింది. అలాగే వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాలు, మెరుగైన బ్యాటరీ జీవితకాలం వాగ్దానం చేస్తుందని వివరించింది. ఈ సందర్భంగా బౌన్స్ ఇన్ఫినిటీ సహ వ్యవస్థాపకుడు సీఈఓ వివేకానంద హల్లెకెరే మాట్లాడుతూ లిక్విడ్-కూల్డ్ పోర్టబుల్ బ్యాటరీలు ఏదైనా ప్రామాణిక 5 ఆంపియర్ సాకెట్ వద్ద సౌకర్యవంతంగా చార్జ్ చేసుకోవచ్చని తెలిపారు. రిఫ్రిజిరేటర్లు, హీటర్లు వంటి ఉపకరణాలకు ఉపయోగించే మాదిరిగానే ప్రతి ఇంట్లో కనిపించే 15 ఆంపియర్ సాకెట్ వద్ద వేగంగా ఇవి చార్జ్ అవుతాయని పేర్కొన్నారు.
అత్యధిక రేంజ్..
బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 మోడల్‌లో చేర్చిన ఈ కొత్త టెక్నాలజీ ఇప్పుడు సింగిల్ చార్జ్ పై 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఆకట్టుకునే పరిధిని సులభంగా అందిస్తుందని కంపెనీ పేర్కొంది. భారతదేశంలోని కఠినమైన ఆపరేటింగ్ పరిస్థితుల కోసం ప్రత్యేకంగా కొత్త బ్యాటరీ సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా ఈవీ విప్లవాన్నిశక్తివంతం చేయనున్నట్లు కంపెనీ వివరించింది. ఇది బ్యాటరీకి భద్రతతో పాటు దీర్ఘ-శ్రేణి, వేగవంతమైన ఛార్జింగ్ ఈవీలను ఎనేబుల్ చేస్తుందని వెల్లడించింది.
బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్పెసిఫికేషన్లు ఇవి..
ఈ కొత్త లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ శక్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని, ఇది 2.5 KWh ఉంటుంది. ఒకే ఛార్జ్‌పై 112-120 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది మునుపటి మోడల్1.9 kWh, 85 కిలోమీటర్ల పరిధి కంటే గణనీయంగా పెరిగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




