AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BMW EV Scooter: వచ్చే నెలలోనే బీఎండబ్ల్యూ ఈవీ స్కూటర్ లాంచ్.. లుక్ చూస్తే మతిపోతుందంతే..!

ప్రస్తుతం భారతదేశ ఆటో మొబైల్ రంగంలో ఈవీ స్కూటర్లు తమ హవాను చూపుతున్నాయి. దీంతో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ అన్ని ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. అయితే పిండి కొద్దీ రొట్టె అన్న చందాన ఈవీ స్కూటర్లకు మనం పెట్టే డబ్బును బట్టే అధునాత ఫీచర్లతో ఈవీ స్కూటర్లు అందుబాటులో ఉంటున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ బీఎండబ్ల్యూ సీఈ 04 పేరుతో సూపర్ స్టైలిష్ ఈవీ స్కూటర్‌ను మార్కెట్‌లో లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

BMW EV Scooter: వచ్చే నెలలోనే బీఎండబ్ల్యూ ఈవీ స్కూటర్ లాంచ్.. లుక్ చూస్తే మతిపోతుందంతే..!
Bmw Ce04
Nikhil
|

Updated on: Jun 25, 2024 | 6:30 PM

Share

ప్రస్తుతం భారతదేశ ఆటో మొబైల్ రంగంలో ఈవీ స్కూటర్లు తమ హవాను చూపుతున్నాయి. దీంతో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ అన్ని ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. అయితే పిండి కొద్దీ రొట్టె అన్న చందాన ఈవీ స్కూటర్లకు మనం పెట్టే డబ్బును బట్టే అధునాత ఫీచర్లతో ఈవీ స్కూటర్లు అందుబాటులో ఉంటున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ బీఎండబ్ల్యూ సీఈ 04 పేరుతో సూపర్ స్టైలిష్ ఈవీ స్కూటర్‌ను మార్కెట్‌లో లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా ఎలక్ట్రిక్ 2డబ్ల్యూను భారత మార్కెట్‌లో లాంచ్ చేస్తుందని ఎప్పటి నుంచో నిపుణులు చెబుతున్నారు. ఆ వార్తలను నిజం చేస్తూ జూలై 24న బీఎండబ్ల్యూ సీఈ 04 లాంచ్‌ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీఎండబ్ల్యూ సీఈ 04 ధర ఇత ఫీచర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

బీఎండబ్ల్యూ గతంలో లాంచ్ చేసిన సీ 400 జీటీ ధర రూ.11.25 లక్షలుంటే సీఈ 04 స్కూటర్ కంటే ఎక్కువ ధర అవుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ స్కూటర్ స్టైలిష్ లుక్‌తో స్కూటర్ ప్రియులను ఆకర్షిస్తుంది. ప్రస్తుతం సీఈ 04 స్కూటర్ నార్త్ అమెరికా, యూరప్ వంటి ప్రపంచ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. బీఎండబ్ల్యూ సీఈ 04లోని 8.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. బీఎండబ్ల్యూ ఐఎక్స్‌లోని 11 బ్యాటరీ మాడ్యూళ్లలో ఒకటిగా ఉంది. సీఈ 04 ఎలక్ట్రిక్ మాక్సీ స్కూటర్‌లోని మోటారు, ఇది 42 బీహెచ్‌పీ శక్తిని, 62 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బీఎండబ్ల్యూ సీఈ 04 ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా 10.25 ఇంచుల స్క్రీన్‌‌తో వస్తుంది. ఇది పాత 3 సిరీస్ సెడాన్‌లో కనిపించే స్క్రీన్‌‌లా ఉంటుంది. 

బీఎండబ్ల్యూ పొడవాటి వీల్‌బేస్, విస్తృత ప్రొఫైల్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్ సెంట్రల్ టన్నెల్‌లో బ్యాటరీలు నిక్షిప్తమై ఉన్నందున ఇది స్టెప్ త్రూ స్కూటర్ కాదు. ఈ స్కూటర్ యాక్సెస్ పొందడానికి పికప్ ట్రక్‌లో టెయిల్‌గేట్ లాగా పడిపోతున్న సైడ్ బాడీ ప్యానెల్‌లను తెరవాలి. బీఎండబ్ల్యూ సీఈ 04 సాంకేతికతతో నిండిపోయింది. ఈ స్కూటర్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, కీలెస్ యాక్సెస్, బీఎండబ్ల్యూ మోటోరాడ్ కనెక్ట్ యాక్సెస్‌తో పాటు మూడు రైడ్ మోడ్‌లతో ఉంటుంది. ఏఎస్సీ, డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్‌తో వస్తుంది. ముఖ్యంగా ఈ స్కూటర్ రివర్స్ ఫంక్షనాలిటీని కూడా పొందుతుంది. త్వరిత ఛార్జర్‌తో 0-80 శాతం కేవలం 65 నిమిషాల్లో వస్తుంది. హార్డ్‌వేర్ కాంపోనెంట్‌లో 35 ఎంఎం ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుక మోనో-షాక్, బెల్ట్-డ్రైవ్, ముందువైపు డ్యూయల్ డిస్క్ సెటప్, వెనుకవైపు సింగిల్ డిస్క్, సింగిల్-సైడెడ్ స్వింగార్మ్ వంటి వాటితో వస్తాయి. ఈ స్కూటర్ 231 కిలోల బరువు  ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మాక్సీ స్కూటర్ కేవలం 130 కిమీ పరిధిని, 120 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం