AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL Broadband: రూ. 299కే బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌.. సరికొత్త ప్లాన్స్‌ అందుబాటులోకి..

BSNL Broadband: ప్రస్తుత కాలంలో పోటీ ప్రపంచం నెలకొంది. వ్యాపారంలో ఎవరికి వారు కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఎన్నో ఆఫర్లను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నాయి...

BSNL Broadband: రూ. 299కే బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌.. సరికొత్త ప్లాన్స్‌ అందుబాటులోకి..
Subhash Goud
|

Updated on: Feb 28, 2021 | 6:35 PM

Share

BSNL Broadband: ప్రస్తుత కాలంలో పోటీ ప్రపంచం నెలకొంది. వ్యాపారంలో ఎవరికి వారు కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఎన్నో ఆఫర్లను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా టెలికం రంగంలో అయితే బంపర్ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ తర్వాత ఉద్యోగులు వర్క్‌ ఫ్రం చేస్తున్నారు. రోజురోజుకు ఇంటర్నెట్‌ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సంస్థలు కూడా తక్కువ ధరకే ఇంటర్నెట్‌ అందిస్తున్నాయి. తాజాగా భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) దేశ వ్యాప్తంగా అతి తక్కువ ధరకే కొత్త ఇంటర్నెట్‌ ప్లాన్స్‌ అందుబాటులోకి తీసుకు వచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.299, రూ.399, రూ.555 ధరకే కొత్త బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్స్‌ అందిస్తోంది. ఇంతకన్న ఎక్కువ ధర కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్స్‌ కూడా ఉన్నాయి. అయితే ఈ బ్రాడ్‌ బ్యాండ్ ప్లాన్స్ 2021 మార్చి 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఉద్యోగుల వర్క్‌ ఫ్రంను దృష్టిలో ఉంచుకుని ఈ ఆఫర్లను ప్రకటించింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్స్‌..

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.299 బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్‌ కింద 100 జీబీ డేటా 10 ఎంబీపీఎస్‌ హైస్పీడ్‌తో అందిస్తోంది. డేటా పూర్తి అయ్యాక ఇంటర్నెట్‌ స్పీడ్‌ 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ ప్లాన్‌ ఆరు నెలలే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత రూ.399 బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్‌కు మారాల్సి ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.399 బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్‌ తీసుకుంటే 10 ఎంబీపీఎస్‌ హై స్పీడ్‌తో 200 జీబీ డేటా అందిస్తుంది. డేటా పరిమితి అయిపోయిన తర్వాత వేగం 2 ఎంబీపీఎస్‌ తగ్గుతుంది. రూ. 555 బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్‌ తీసుకుంటే 10 ఎంబీపీఎస్‌ వేగంతో 500 జీబీ డేటా వస్తుంది. డేటా పూర్తయిన తర్వాత ఇంటర్‌నెట్‌ వేగం 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. కొత్త వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.299, రూ.399 ప్లాన్‌లు తీసుకోవాలంటే రూ. 500 సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది. కాగా, ఇలాంటి సేవలను బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థనే కాకుండా ఇతర టెలికం సంస్థలు కూడా ఉద్యోగుల వర్క్‌ ఫ్రం హోం దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఎన్నో ఆఫర్లను ప్రకటించాయి. లాక్‌డౌన్‌ ఉన్న సమయంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోంను ఇచ్చాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో కొన్ని కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన కంపెనీలు ఉద్యోగులు తమ తమ కార్యాలయాల్లోనే ఉద్యోగం నిర్వహించేలా చేశాయి. దీంతో ఎయిర్‌టెల్‌, జియో, ఐడియా తదితర టెలికం సంస్థలు ఇలాంటి ఆఫర్లు కూడా ప్రకటించాయి. ఇక కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఉద్యోగులు మళ్లీ వర్క్‌ఫ్రం హోం బాట పట్టే అవకాశాలున్నాయి.

ఇవీ చదవండి:

Aadhaar Number: మీ ఆధార్‌ కార్డు మీ వద్ద లేదా.. ఆధార్‌ నెంబర్‌ మర్చిపోయారా.. సింపుల్‌గా తెలుసుకోండిలా..!

Facebook BARS App: టిక్‌టాక్‌ మాదిరిగా ఫేస్‌బుక్‌ యాప్‌.. అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి..

Bharti Airtel: మరో రంగంలోకి అడుగు పెడుతున్న ఎయిర్‌టెల్‌.. క్వాంటిటీ కోసం కాకుండా క్వాలిటీ కోసం