Best Psu Stocks: ఈ మూడు ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లలో ఇన్వెస్టర్లకు లాభాలు..!
Best Psu Stocks: 2025 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 16.6% పెరిగి రూ.2,827 కోట్లకు చేరుకుంది. నికర లాభం 24.6% పెరిగి రూ.142 కోట్లకు చేరుకుంది. NBCC (ఇండియా) లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని..

ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లు అంటే PSUలు ఎల్లప్పుడూ ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలుగా పరిగణిస్తారు. ఎందుకంటే అవి స్థిరత్వం, డివిడెండ్ల ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం వంటి అనేక మంచి అంశాలను కలిగి ఉంటాయి. ఈ కంపెనీలలో ప్రభుత్వం కనీసం 51 శాతం వాటాను కలిగి ఉంది. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఇక్కడ మనం 100 శాతం స్కోరు ఉన్న మూడు పీఎస్‌యూ స్టాక్‌ల గురించి తెలుసుకుందాం. ఇది పియోట్రోస్కీ స్కోర్. ఇది పెట్టుబడిదారులకు కంపెనీ ఆర్థిక స్థితి గురించి తెలుసుకోవడానికి సహాయపడే సాధనం. ఈ స్కోరు 0-9 మధ్య ఇస్తారు. 9 అంటే కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని అర్థం. 7 నుండి 9 మధ్య స్కోరు ఉన్న మూడు PSU స్టాక్‌ల పేర్లు చూద్దాం. ప్రత్యేకత ఏమిటంటే వాటి ధర రూ.100 కంటే తక్కువ.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: దీని షేరు ధర రూ.47 వద్ద ఉంది. సోమవారం ఒక రోజు ముందు ఇది 1.2% లాభపడింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.34,319.7 కోట్లు. ప్రసిడెంట్ బహిరంగంగా 79.6% వాటాను కలిగి ఉన్న కొన్ని స్టాక్‌లలో ఇది ఒకటి.
దీని పియోట్రోస్కీ స్కోరు 7: 2025 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (NII) దాదాపు 19.4% పెరిగి రూ. 2,943.6 కోట్లకు చేరుకుంది. నికర లాభం 36% పెరిగి రూ.1,406.7 కోట్లకు చేరుకుంది.
ఎన్‍బిసిసి (ఇండియా) లిమిటెడ్: దీని షేరు ధర రూ.74.5 వద్ద ఉంది. సోమవారం ఒక రోజు ముందు రోజు ఇది 2.2% పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.19,883 కోట్లు. ఇందులో ప్రభుత్వ ఆధీనంలో ఉండే షేర్లు రాష్ట్రపతి పేరుపై వాటా 61.75% కలిగి ఉంటుంది.
దీని పియోట్రోస్కీ స్కోరు 8: 2025 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 16.6% పెరిగి రూ.2,827 కోట్లకు చేరుకుంది. నికర లాభం 24.6% పెరిగి రూ.142 కోట్లకు చేరుకుంది. NBCC (ఇండియా) లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న సంస్థ. ఇది ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ, ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (EPC), రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో పనిచేస్తుంది.
బాల్మర్ లారీ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్
దీని స్టాక్ ధర రూ. 62.9. అంతకుముందు రోజు సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో 2.4% పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,343 కోట్లు. ఇందులో రాష్ట్రపతి పేరుపై ఉండే వాటా 59.67%. 2025 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో కంపెనీ ఆపరేటింగ్ ఆదాయం 8% పెరిగి రూ.633 కోట్లకు చేరుకుంది. అయితే నికర లాభం 6% తగ్గి రూ.64 కోట్లకు చేరుకుంది. బాల్మర్ లారీ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్, గ్రీజులు అండ్ లూబ్రికెంట్లు, లెదర్ కెమికల్స్ వ్యాపారంలో ఉంది.
Disclaimer: టీవీ9 ఏ స్టాక్‌లలోనూ పెట్టుబడి పెట్టమని సిఫార్సు చేయదు. పెట్టుబడి పెట్టే ముందు మీరు మీ ఆర్థిక సలహాదారుడి సలహా తీసుకోవాలి. ఏవైనా లాభాలు లేదా నష్టాలకు వెబ్‌సైట్ బాధ్యత వహించదు.
ఇది కూడా చదవండి: Aadhaar Biometric Lock: ఆధార్ బయోమెట్రిక్‌ను ఆన్‌లైన్‌లో ఎలా లాక్ చేయాలి? ఇన్ని రకాలుగా చేయొచ్చా!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




