Business Ideas: ఉన్న ఊరిలోనే ఈ వ్యాపారంతో నెలకు రూ. లక్ష వరకు సంపాదన.. అదేంటంటే.?
ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలని అనుకుంటున్నారా.? రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించాలని చూస్తున్నారా.? అయితే ఈ చక్కటి బిజినెస్ ప్లాన్ మీకోసమే.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఈ బిజినెస్ వల్ల మాంచి లాభాలు రావడమే కాదు.. ఉన్న ఊరిలోనే ఇంటి వద్దే..

ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలని అనుకుంటున్నారా.? రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించాలని చూస్తున్నారా.? అయితే ఈ చక్కటి బిజినెస్ ప్లాన్ మీకోసమే.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఈ బిజినెస్ వల్ల మాంచి లాభాలు రావడమే కాదు.. ఉన్న ఊరిలోనే ఇంటి వద్దే ఆ ఆదాయాన్ని సంపాదించవచ్చు. అది మరేదో కాదండీ.. కోడిగుడ్ల బిజినెస్. రోగనిరోధకశక్తిని పెంపొందించేందుకు కోడిగుడ్లు బాగా ఉపయోగపడతాయి. మీరు కోడిగుడ్లను హోల్‌సేల్‌లో అమ్మితే.. మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.
ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే.. ముందుగా మీరు స్థానికంగా ఉన్న పౌల్ట్రీ సంస్థల నుంచి డీలర్‌షిప్ లైసెన్స్ తీసుకోవాలి. అలాగే మున్సిపాలిటీ నుంచి పర్మిషన్.. ఇంకా జీఎస్టీ నెంబర్ పొందాలి. ఇవన్నీ వచ్చిన అనంతరం మీరు కోడిగుడ్ల సప్లయ్‌ని ప్రారంభించవచ్చు. ఇక ఈ కోడిగుడ్ల స్టాక్‌ను భద్రపరచడానికి ఓ చిన్నపాటి గౌడౌన్ లేదా ఓ చిన్న షట్టర్ లాంటిది ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత మీ సమీప గ్రామాల్లో.. అలాగే స్థానిక కిరాణా షాపులలో, కూరగాయల మార్కెట్, వెజిటబుల్ షాపుల్లో కోడిగుడ్లు సప్లయ్ చేయడం ప్రారంభించండి. మొదటిగా మీరు ఒకట్రెండు షాపులతో ఈ హోల్‌సేల్ కోడిగుడ్ల బిజినెస్ మొదలుపెడితే.. మీకు టూ-వీలర్ లాంటిది సరిపోతుంది. అలా కాదని మీరు ఒకేసారి పది నుంచి పదిహేను షాపులను మాట్లాడి పెట్టుకుంటే.. కోడిగుడ్లు సప్లయ్ చేసేందుకు ఓ మినీ వ్యాన్ ఉంటే మంచిది. దాని ద్వారా మీరు ఒకేసారి పెట్రోల్ ఖర్చు ఎక్కువ కాకుండా.. అన్ని షాపులకు కోడిగుడ్లను సప్లై చేయవచ్చు.
సీజన్‌తో సంబంధం లేకుండా.. అన్ని వేళలా కోడిగుడ్లకు మాంచి గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా మీరు హోటళ్లు, కర్రీ పాయింట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకుంటే.. వీరి నుంచి ప్రతీ రోజూ భారీగా ఆర్డర్లు లభిస్తాయి. అలాగే రెగ్యులర్‌గానూ వీరికి సప్లయ్ చేయవచ్చు. ఇక నేరుగా పౌల్ట్రీ ఫారం నుంచి తెచ్చే నాటు కోడిగుడ్లకు అయితే.. డిమాండ్ విపరీతంగా ఉంటుంది. వీటిని ఎక్కువ ధరకు కూడా మీరు అమ్మవచ్చు. ఇలా అన్ని ఖర్చులు పోనూ.. మీరు నెలనెలా దాదాపు రూ. లక్ష వరకు సంపాదన పొందే అవకాశం ఉంది. ఒక్క కోడిగుడ్లతోనే ఆగకుండా.. వ్యాపారం వృద్ది చెందే కొద్ది.. ఇతరత్రా తినుబండారాలను కూడా హోల్‌సేల్‌గా అమ్మితే.. మీ లాభాలు మరింత పెరుగుతాయి.




