Earning from Home: మగువలకు చక్కటి అవకాశం.. ఇలా చేస్తే ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించొచ్చు.. ఎలాగంటే..
అయితే ఇంట్లోనే ఉండి అదనపు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ప్రస్తుతం ఆధునిక సాంకేతికత మనకు అందించింది. ఇంట్లోనే ఉంటూ ఖాళీ సమయాల్లో వివిధ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించవచ్చు.
మహిళలు మహరాణులు అంటారు పెద్దలు.. ఎందుకంటే గృహసీమను తనే పాలిస్తుంది కాబట్టి. ఆ గృహానికి అంతా తానై.. అన్నీ తానై నడిపిస్తుంది కాబట్టి.. అటు భర్తకు అవసరమైన సపర్యలు చేస్తూనే.. పిల్లలకు కావాల్సినవి అందిస్తూనే.. ఇంటిని చక్కబెడుతుంది కాబట్టి. అయితే ఇటీవల కాలంలో కేవలం వారు ఇంటికే పరిమితం అవ్వాలి అనుకోవడం లేదు. ఉద్యోగాలు చేస్తున్నారు.. పురుషునితో సమానంగా నిలబడుతున్నారు.. అయితే కొంతమంది మహిళలు మాత్రం పిల్లలు పుట్టాక, వారిని చూసుకుంటూ.. ఇతర పనులతో సతమతమవుతూ.. ఇక చాలులే అనుకుని అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. అయితే ఇంట్లోనే ఉండి అదనపు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ప్రస్తుతం ఆధునిక సాంకేతికత మనకు అందించింది. ఇంట్లోనే ఉంటూ ఖాళీ సమయాల్లో వివిధ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించవచ్చు. తద్వారా కుటుంబానికి కొంత ఆర్థిక భరోసాగా నిలవవచ్చు. ఆ మార్గాల్లో కొన్ని బెస్ట్ ఇప్పుడు చూద్దాం..
ఆన్‌లైన్ సర్వేలు.. చాలా కంపెనీలు తమ ఉత్పత్తులపై వినియోగదారుల అభిప్రాయాల కోసం ఈ ఆన్ లైన్ సర్వేలపై ఆధారపడుతున్నాయి. ఇది ఇంట్లోనే ఉండే తల్లులకు మంచి ఆదాయమార్గం కాగలదు. మంచి సర్వే వెబ్‌సైట్‌లకు సైన్ అప్ చేసుకొని.. వాటిలో అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
ఫ్రీలాన్సింగ్.. ఇంట్లో ఉండే తల్లులకు అదనపు డబ్బు సంపాదించడానికి ఫ్రీలాన్సింగ్ ఒక గొప్ప మార్గం. ఫ్రీలాన్సింగ్‌లో రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, వెబ్ డెవలప్‌మెంట్, వర్చువల్ అసిస్టెన్స్ వంటివి ఉంటాయి. ఇది ఇంట్లో ఉండే గృహిణులకు వారి సొంత షెడ్యూల్‌లో , వారి సౌకర్యాన్ని బట్టి పనిచేసుకునే వీలుంటుంది.
ఆన్‌లైన్‌లో ఉత్పత్తులను అమ్మడం.. ఇంట్లోనే ఉండే తల్లులు వారి సొంత ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించవచ్చు. లేదా వారు తయారు చేసిన ఉత్పత్తులను ఆన్ లైన్ లో విక్రయించవచ్చు. లేకుంటే బల్క్ గా కొన్ని వస్తువులను కొనుగోలు చేసి, తిరిగి డిస్కౌంట్‌తో తిరిగి అమ్మవచ్చు. Etsy, Amazon, Ebay వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఇలాంటి వాటిని చేయడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తాయి.
ఆన్‌లైన్ ట్యూటరింగ్.. ఇంట్లోనే ఉండే తల్లికి నిర్దిష్ట నైపుణ్యం లేదా జ్ఞానం ఉంటే, వారు ఆన్‌లైన్‌లో విద్యార్థులకు ట్యూషన్ చెప్పొచ్చు. మీకు ఏదైనా ఒక అంశంపై పట్టు ఉంటే దానిని ఆదాయమార్గంగా మలుచుకొని అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చు.
చైల్డ్ కేర్.. ప్రస్తుత మార్కెట్ లో ట్రెండీ బిజినెస్ ఇది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న తరుణంలో వారి చిన్న పిల్లలను చూసుకేనేందుకు నమ్మకమైన, విశ్వసనీయమైన సంరక్షకుల కోసం వారు వెతుకుతున్నారు. అటువంటి వారి కోసం మంచి చైల్డ్ కేర్ సెంటర్ ను ప్రారంభించవచ్చు. మీ ఇంట్లోనే దీనిని నిర్వహించవచ్చు. ఫలితంగా అదనపు ఆదాయం సమకూరుతుంది.
బ్లాగింగ్.. ఇంట్లో ఉండే తల్లులు తమ అనుభవాలు, ఆసక్తులను ఇతరులతో పంచుకోవడానికి బ్లాగింగ్ ఒక గొప్ప మార్గం. విజయవంతమైన బ్లాగ్‌తో, ఇంట్లోనే ఉండే తల్లులు ప్రకటనలు, ప్రాయోజిత కంటెంట్, అనుబంధ మార్కెటింగ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..