AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ఉద్యోగంతో విసిగిపోయారా.? చామంతి పూలతో లక్షల్లో ఆదాయం పొందొచ్చు..

అయితే మంచి ఐడియాతో వ్యాపారం మొదలు పెట్టాలే కానీ, మీతో పాటు మరో నలుగురికి కూడా ఉపాధి కల్పించొచ్చు. ఇలాంటి ఎన్నో బిజినెస్‌ ఐడియాలు మార్కెట్లో ఉన్నాయి. అలాంటి ఓ బిజినెస్‌ ఐడియానే చామంతి పూల పెంపకం. వినడానికి సింపుల్‌గానే ఉన్నా ఇప్పుడీ వ్యాపారం సిరులు కురిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరు రైతులు చామంతి పూలను పండిస్తూ లక్షల్లో గడిస్తున్నారు. ఇంతకీ చామంతి పూల పెంపకాన్ని...

Business Idea: ఉద్యోగంతో విసిగిపోయారా.? చామంతి పూలతో లక్షల్లో ఆదాయం పొందొచ్చు..
Chamomile Flower Farming
Narender Vaitla
|

Updated on: Oct 12, 2023 | 10:59 PM

Share

ఉదయం 9 గంటలకు ఆఫీసుకు వెళ్లి సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరుకునే రోటీన్‌ జాబ్ చేసీ, చేసీ బోర్‌ కొడుతోందా.? ఎన్ని ఏళ్లయినా ఉద్యోగంలో ఎదుగదల లేదని చింతిస్తున్నారా.? ఇంకెన్ని రోజులు ఈ బోర్‌ జాబ్‌ అనే ఆలోచనలో ఉన్నారా.? ఉద్యోగం చేసే చాలా మంది ఆలోచన ఇలాగే ఉంటుంది. అయితే వ్యాపారంలోకి దిగుదామంటే లాభం వస్తుందో లేదో అన్ని నమ్మకం ఉండదు. ఉద్యోగం అయితే ఓ భద్రత ఉంటుందని ఆశతో చాలా మంది ఉద్యోగులుగానే మిగిలిపోతారు.

అయితే మంచి ఐడియాతో వ్యాపారం మొదలు పెట్టాలే కానీ, మీతో పాటు మరో నలుగురికి కూడా ఉపాధి కల్పించొచ్చు. ఇలాంటి ఎన్నో బిజినెస్‌ ఐడియాలు మార్కెట్లో ఉన్నాయి. అలాంటి ఓ బిజినెస్‌ ఐడియానే చామంతి పూల పెంపకం. వినడానికి సింపుల్‌గానే ఉన్నా ఇప్పుడీ వ్యాపారం సిరులు కురిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరు రైతులు చామంతి పూలను పండిస్తూ లక్షల్లో గడిస్తున్నారు. ఇంతకీ చామంతి పూల పెంపకాన్ని ఎలా ప్రారంభించాలి.? వీటికి అసలు డిమాండ్‌ ఎందుకు ఉంది.? ఈ వ్యాపారంతో ఏటా ఎంత ఆర్జించవచ్చు లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

చామంతి పూలు అనగానే మనం ఎక్కువగా అలంకరణకు ఉపయోగించే పువ్వుగానే భావిస్తాం. కానీ చామంతిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని మీకు తెలుసా.? అవును ఎన్నో ఔషధ శక్తులకు చామంతి పెట్టింది పేరు. దీనిని మ్యాజికల్ ఫ్లవర్‌గా పిలుస్తుంటారు. ఎన్నో రకాల ఆయుర్వే, హోమియోపతి ఔషధాల తయారీల్లో చామంతి పువ్వులను ఉపయోగిస్తున్నారు. అందుకే ఈ పూలకు ఇప్పుడు మార్కెట్లో ఫుల్ డిమాండ్‌ ఉంది. కడుపు సంబంధిత వ్యాధులకు చామంతితో తయారు చేసిన ఔషధాలను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కూడా చామంతి పూలను ఉపయోగిస్తున్నారు.

దీంతో కొన్ని కంపెనీలు నేరుగా రైతుల వద్దకు వచ్చి చామంతి పూలను కొనుగోలు చేస్తున్నారు. ఇక చామంతిని పండించడానికి సారవంతమైన భూమి కూడా అవసరం లేదు, బంజరు భూమిలో కూడా పండించుకోవచ్చు. రెండున్నర ఎకరాల్లో సుమారు 12 క్వింటాళ్ల పూలను పండిచ్చొచ్చు. ఇక చామంతి పూలను పంట వేయడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. పెట్టుబడికి 5 నుంచి 6 రెట్లు లాభం వస్తుందని చెబుతున్నారు. ఇక ఈ పంట కేవలం 6 నెలల్లోనే పంట చేతికి వస్తుంది అంటే ఏడాది మొత్తం పంట దిగుబడి వస్తుంది. ఇక చామంతి పూల అల్సర్, డయాబెటిస్‌ వ్యాధులతో పాటు చర్మ వ్యాధులను ఎదుర్కోవడంలో ఉపయోగిస్తుంటారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..