SSY: కూతురు పెళ్లి సమయానికి రూ. 25 లక్షలు పొందాలంటే.. సుకన్య పథకంలో నెలకు ఎంత కట్టాలంటే..
ఇక ఈ పథకంలో చిన్నారికి పదేళ్ల వయసులోనే చేరొచ్చు. గరిష్టంగా ఇద్దరు ఆడ బిడ్డలకు మాత్రమే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచే అవకాశం ఉంటుంది. ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఐడీ, అడ్రస్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికేట్, ఆడబిడ్డతో పాటు ఆమె తండ్రి ఫొటోల, ఆధార్ కార్డు కావాల్సి ఉంటాయి. ఇక ఈ పథకంలో అకౌంట్‌ను మినిమం రూ. 250 డిపాజిట్ చేసి ఓపెన్ చేయొచ్చు. గరిష్టంగా ఏడాదికి రూ. 1.50 లక్ష వరకు...
కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఆకర్షణీయమైన డిపాజిట్ స్కీం పథకాలను ప్రవేశపెడతోంది. బీటీ బచావో బేటీ పడావో నినాదంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సుకన్య నమృద్ధి యోజన పథకం ఎంతటి ప్రాముఖ్యతను సంతరించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆడబిడ్డల చదువు, పెళ్లి సమయానికి రిటర్న్స్ పొందేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకంలో భాగంగా వినియోగదారులు 15 ఏళ్లపాటు డబ్బులు కట్టాలి, 21 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత డబ్బును పొందొచ్చు.
ఇక ఈ పథకంలో చిన్నారికి పదేళ్ల వయసులోనే చేరొచ్చు. గరిష్టంగా ఇద్దరు ఆడ బిడ్డలకు మాత్రమే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచే అవకాశం ఉంటుంది. ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఐడీ, అడ్రస్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికేట్, ఆడబిడ్డతో పాటు ఆమె తండ్రి ఫొటోల, ఆధార్ కార్డు కావాల్సి ఉంటాయి. ఇక ఈ పథకంలో అకౌంట్‌ను మినిమం రూ. 250 డిపాజిట్ చేసి ఓపెన్ చేయొచ్చు. గరిష్టంగా ఏడాదికి రూ. 1.50 లక్ష వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అకౌంట్ తెరిచిన నాటి నుంచి 15 ఏళ్లు డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆరేళ్ల తర్వాత అంటే 21 ఏళ్లకు మెచ్చూరిటీ వస్తుంది. ఈ ఆరేళ్లు ఎలాంటి డిపాజిట్ చేయాల్సి అవసరం ఉండదు.
ఇక అకౌంట్ ఓపెన్ చేసి తర్వాత ఏదైనా కారణాలతో డబ్బులు డిపాజిట్ చేయకపోతే సదరు అకౌంట్ అండర్ డిఫాల్ట్‌లోకి వెళ్లిపోతుంది. ఒకవేళ అకౌంట్‌ను తిరిగి యాక్టివేట్ చేసుకోవాలంటే ఏండాదికి రూ. 50 చొప్పున ఫైన్ చెల్లించి అకౌంట్‌ను మళ్లీ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ తెరిచిన నాటి నుంచి 15 ఏళ్లలోపు మళ్లీ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా చిన్నారి పెళ్లి నాటికి, లేదా ఉన్న చదువుల నాటికి రూ. 25 లక్షలు చేతికి రావాలంటే నెలకు ఎన్ని డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుందో ఇప్పుడ తెలుసుకుందాం..
ఉదాహరణకు మీ చిన్నారి వయసు ప్రస్తుతం 5 ఏళ్లు అనుకుందాం. ప్రస్తుతం ఈ పథకంలో వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. ఈ లెక్కన ఏడాదికి రూ. 55,700 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మెచ్యూరిటీ సమయానికి మీకు రూ. 25 లక్షలు చేతికి వస్తాయి. అంటే నెలకు రూ. 4,641 చెల్లిస్తే కూతురు వివాహం సమయానికి రూ. 25 లక్షలు రిటర్న్ పొందొచ్చు. ఇక ఈ పథకం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం మీరు రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. డిపాజిట్‌పై మీకు వచ్చే వడ్డీపై టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. వడ్డీ వార్షిక ప్రాతిపదికన చెల్లిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత మీకొచ్చే వడ్డీ కూడా టాక్స్ ఫ్రీగానే ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..