Home Loan: హౌసింగ్ లోన్ తీసుకునే వారికి బంపరాఫర్.. వడ్డీ రేట్లను భారీగా తగ్గించిన ఆ బ్యాంక్..
కరోనా తాలుకు ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోంది. మొన్నటి వరకు ఆతితూచి ఖర్చు పెట్టిన ప్రజలు మళ్లీ ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణాలు సైతం పెరుగుతున్నాయి. సాధారణంగా ఇంటి నిర్మాణానికి వెళ్లే ముందు కచ్చితంగా..
కరోనా తాలుకు ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోంది. మొన్నటి వరకు ఆతితూచి ఖర్చు పెట్టిన ప్రజలు మళ్లీ ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణాలు సైతం పెరుగుతున్నాయి. సాధారణంగా ఇంటి నిర్మాణానికి వెళ్లే ముందు కచ్చితంగా హోమ్ లోన్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా తమ ఖాతాదారుల కోసం వడ్డీ రేట్లను తగ్గించింది. హోమ్‌లోన్ తీసుకునే వారికి చౌకగా రుణం ఇవ్వనున్నట్లు ప్రకటనలో విడుదల చేసింది. తాజాగా ఈ బ్యాంక్ హోమ్ లోన్ రేట్లపై 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్స్‌పై ఏడాదికి 8.25 శాతం ప్రారంభ వడ్డీతో రుణాలు అందిస్తోంది. తగ్గించిన ఈ రేట్లు నవంబర్ 14,2022 నుంచి వర్తించనున్నాయి.
కొత్తగా గృహ రుణాలు తీసుకునే వారికి ఈ ఆఫర్ అందిస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే ఇతర బ్యాంకుల్లో హోమ్ లోన్ ఉన్న వారు బ్యాంక్ ఆఫ్ బరోడాకు లోన్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఖాతాదారులకు కూడా 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా మరో అదనపు సౌకర్యం కింద హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఛార్జీలను మాఫీ చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత ఆకర్షణీయమైన ధరలకు గృహ రుణాలను అందిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా చెబుతోంది. ఈ అవకాశం కేవలం కొత్తగా హౌస్ లోన్ తీసుకునే వారికే వర్తిస్తుంది.
ఇదిలా ఉంటే బ్యాంక్ ఆఫ్ బరోడా కల్పిస్తోన్న ఈ రాయితీ ద్వారా ఖాతాదారులకు కలిగే ప్రయోజం ఏంటంటే.. ఉదాహరణకు మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 30 లక్షలు లోన్ తీసుకున్నారు అనుకుందాం. 20 సంవత్సరాలకు ఈఎమ్‌ఐ ఎంచుకుంటే మీరు నెలకు రూ. 25,562 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర బ్యాంకుల విషయానికొస్తే.. 8.5 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ వడ్డీ రేటుతో రూ. 30 లక్షల రుణం, 20 ఏళ్ల కాల వ్యవధికి తీసుకుంటే రూ. 26,035 ఈఎమ్‌ఐ చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..